ఎండు గడ్డిలా వున్న జుట్టును సిల్కిగా మారాలంటే..?

Divya
మన జుట్టు ఆరోగ్యంగా,సిల్కిగా ఉండకపోవడానికి వాతావరణం లో మార్పులు,జీవనశైలి,ఆహారపు అలవాట్లు,హార్మోనల్ సమస్యలు వంటివి కారణాలుగా చెప్పవచ్చు.మరియు జుట్టును సరిగా శుభ్రం చేసుకోవడం,ఎండవేడికి వెళ్లడం వంటివి చేయడం వల్ల మన జుట్టు నిర్జీవంగా,ఎండు గడ్డిలా తయారవుతూ ఉంటుంది.అలా మారిన జుట్టును సిల్కిగా తయారు చేసుకునేందుకు ఎంతో ఖర్చుపెట్టి హెయిర్ స్పా ట్రీట్మెంట్,కెరొటీన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వుంటారు.అయితే దీని కోసం ప్రత్యేకంగా బ్యూటీ పార్లర్ మరియు స్పాలంటూ తిరగాల్సిన పనిలేదు.రూపాయి ఖర్చు లేకుండా, ఇంట్లోనే జుట్టును సూపర్ సిల్కీగా తయారు చేసుకోవాలంటే,నాచురల్ గా దొరికే పదార్థాలతో చేసుకునే హెయిర్ ప్యాక్ లు చాలా బాగా ఉపయోగపడతాయి.అవి ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..
న్యాచురల్ హెయిర్ ప్యాక్..
దీనికోసం మూడు టేబుల్ స్ఫూన్ల మెంతులను తీసుకొని,తగినన్ని నీళ్ళు వేసి,రాత్రంతా నానబెట్టాలి.మరియు పచ్చికొబ్బరి తీసుకొని,మిక్సీ పట్టి పాలను వడకట్టుకోవాలి.నానబెట్టిన మెంతులను మరియు కొబ్బరి పాలను కలిపి బాగా మిక్సీ పట్టుకోవాలి.ఈ మిశ్రమానికి రెండు స్పూన్ల ఆముదము మరియు రెండు స్పూన్ల అలోవెర్జెల్ కలిపాలి.ఆ మిశ్రమాన్ని బాగా కలిపి,జుట్టుకు రాయబోయే ముందు, జుట్టును చిక్కులు లేకుండా దువ్వుకొని,ఆ తరువాత ఆ మిశ్రమాన్ని మాడు నుండి చివర్ల వరకు బాగా అప్లై చేసి మర్దన చేయాలి.
అప్లై చేసిన రెండు గంటల తర్వాత,మైల్డ్ షాంపూ తో రుద్దుతూ జుట్టును శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ప్యాక్ లో వాడిన పదార్థాలన్నింటిలోనూ జుట్టుకు మాయిశ్చరైజింగ్ చేసే గుణాలు అధికంగా ఉండడం వల్ల జుట్టు ఎండుగడ్డలా ఉన్నా సరే సూపర్ సిల్కీ గా తయారవుతుంది.కొబ్బరి పాలలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది కావున జుట్టు మెరుపు సంతరించుకొని, పొడవుగా పెరుగుతుంది.అంతేకాక ఈ ప్యాక్ వల్ల, చుండ్రు,దురద,జుట్టు రాలిపోవడం,చివర్లు చిట్లడం వంటించు సమస్యలు తొందరగా తగ్గిపోయి, సిల్కిగా తయారవుతుంది.ఈ ప్యాక్ తో పాటు జుట్టు ఆరోగ్యం కోసం సరైన ఆహారం,సరైన జీవనశైలిని పాటించడం కూడా చాలా ముఖ్యం.మరియు తగినన్ని నీళ్ళు తాగటం వల్ల కూడా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: