ఈ జ్యూస్ తాగితే నిద్రలేమి సమస్య పరార్?

Purushottham Vinay
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రలేమి అనేది అందరికి సర్వసాధారణ సమస్యగా మారింది. ఈ సమస్య ఉంటే షుగర్, గుండె జబ్బులు ఫ్రీగా వస్తాయి.పాపం కొందరికి అర్థరాత్రి దాటినా కూడా అస్సలు నిద్ర రాదు.ఈ నిద్రలేమి వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అయితే నిద్రలేమికి చాలా కారణాలు ఉన్నాయి.మనం తినే ఆహారం ద్వారా కూడా నిద్రలేమి సమస్యన అధిగమించవచ్చు. అందువల్ల నిద్రలేమితో బాధపడేవారు కొన్ని రకాల ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అన్ని రకాల ఆహారాలను తిన్నా తినకపోయినా తప్పని సరిగా ద్రాక్ష రసం ఖచ్చితంగా తాగాలని వారు అంటున్నారు. ఎందుకంటే.. నిద్రకు సహకరించే మెలటోనిన్ అనే హార్మోన్ ఈ ద్రాక్షలలో పుష్కలంగా ఉంటుందట. ఈ కారణంగా పడుకోవడానికి అరగంట ముందు ద్రాక్షను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి చాలా ఈజీగా విముక్తి పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.


ఇక కేవలం ఆరోగ్య నిపుణులే కాక అనేక అధ్యయానాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ద్రాక్షరసం కనుక తాగితే ఖచ్చితంగా ప్రశాంతమైన నిద్ర ఖాయమని కొందరు అనుభవజ్ఞులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ద్రాక్షరసంతో పాటు గోరు వెచ్చని పాలు తాగినా కూడా కొంతమందికి నిద్ర ఈజీగా పడుతుంది. ఇంకా అంతేకాక పాలకూరను కూడా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు.ఇంకా ఇదే కాక చెర్రీ పండ్లు, మజ్జిగ వంటివాటిని తీసుకోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్యను చాలా ఈజీగా అధిగమించ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి నిద్రలేమి సమస్యతో బాధ పడేవారు ఖచ్చితంగా ఈ జ్యూస్ తాగండి. ఖచ్చితంగా ఈ సమస్య నుంచి చాలా ఈజీగా బయట పడతారు.ద్రాక్ష రసం కాకపోయినా ప్రతి రోజు నైట్ పాలు తాగినా ఈ సమస్య నుంచి చాలా ఈజీగా ఉపశమనం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: