మండే ఎండలకి శరీరాన్ని కాపాడే మిల్క్ షేక్ ఇదే?

Purushottham Vinay
మనం అరటిపండ్లను కూడా చాలా ఇష్టమైన ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.ఎందుకంటే దీనిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.మన శరీరానికి కావల్సిన శక్తిని అందించడంలో, జీర్ణశక్తి ని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో ఇంకా అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా చాలా రకాలుగా అరటి పండు మనకు సహాయపడుతుంది. దీనిని నేరుగా తినడంతో పాటు ఇంకా అలాగే ఎంతో రుచిగా ఉండే బనానా మిల్క్ షేక్ ను కూడా తయారు చేసుకోని తాగవచ్చు. ఈ వేసవికాలంలో చల్ల చల్లగా రుచిగా ఉండే బనానా మిల్క్ షేక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుంది.రుచిగా, చల్లగా ఇంకా కమ్మగా పిల్లలు మరింత ఇష్టపడేలా బనానా మిల్క్ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


బనానా మిల్క్ షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..అరటిపండ్లు – 4, హార్లిక్స్ పౌడర్ – 5 టేబుల్ స్పూన్స్ ఇంకా ఐస్ క్యూబ్స్ – తగినన్ని అలాగే కాచి చల్లార్చిన పాలు – అర లీటర్ ఇంకా వెనీలా ఐస్ క్రీమ్ – అర కప్పు.


ఇక బనానా మిల్క్ షేక్ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు అరటి పండ్లను ముక్కలుగా కట్ చేసుకుని ఒక జార్ లోకి తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో హార్లిక్స్ పౌడర్, ఐస్ క్యూబ్స్ ఇంకా కొద్దిగా పాలు పోసి మెత్తగా దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత ఐస్ క్రీమ్ మరికొద్దిగా పాలు పోసి అలాగే మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత మిగిలిన పాలు కూడా పోసి బాగా కలుపుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత దీనిపై మరి కొద్దిగా ఐస్ క్రీమ్ ని వేసుకోవాలి. ఇంకా అలాగే కొద్దిగా హార్లిక్స్ పౌడర్ ని చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా చల్ల చల్లగా ఉండే హార్లిక్స్ పౌడర్ తయారవుతుంది. దీనిని పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఇక అవసరం అనుకున్న వారు దీనిలో మరికొద్దిగా పంచదారను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లోనే బనానా మిల్క్ షేక్ ను ఈజీగా తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: