సమ్మర్లో ఇది తాగితే అందం, ఆరోగ్యం మీ సొంతం?

Purushottham Vinay
ఎండా కాలంలో మనకు బయట ఎక్కువగా లభించే డ్రింక్స్ లో లస్సీ కూడా ఒకటి. పెరుగుతో చేసే ఈ లస్సీ చాలా రుచిగా ఇంకా ఉంటుంది. అలాగే మనకు వివిధ రుచుల్లో కూడా ఈ లస్సీ లభిస్తూ ఉంటుంది.వాటిల్లో ఖచ్చితంగా స్వీట్ లస్సీ కూడా ఒకటి. ఇక పంచదార వేసి చేసే ఈ స్వీట్ లస్సీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తాగడం వల్ల ఎండ నుండి ఈజీగా ఉపశమనం కలగడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు కలుగుతుంది. పిల్లలు కూడా దీనిని చాలా ఇష్టంగా తాగుతారు.అయితే కేవలం 5 నిమిషాల్లోనే దీనిని మనం తయారు చేసుకోవచ్చు. ఇక అందరికి నచ్చేలా స్వీట్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలి? అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ స్వీట్  లస్సీ తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..చిక్కటి తియ్యటి పెరుగు – ఒక కప్పు, ఐస్ క్యూబ్స్ – తగినన్ని, పంచదార – 4 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – పావు టీ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా ఇంకా అలాగే ఫ్రెష్ క్రీమ్ లేదా మీగడ – ఒక టీ స్పూన్ తీసుకోవాలి.


ఇంకా ఈ స్వీట్ లస్సీ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా ఒక జార్ లో పెరుగు, ఐస్ క్యూబ్స్, పంచదార ఇంకా అలాగే యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత ఈ లస్సీని గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత దీనిపై మీరు మీగడను వేసుకోవాలి. ఇంకా అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే స్వీట్ లస్సీ తయారవుతుంది. అలాగే దీనిని పెరుగును గిన్నెలో వేసి మనం కవ్వంతో కూడా చిలకవచ్చు. ఈ విధంగా స్వీట్ లస్సీని మీరు తయారు చేసుకుని తాగడం వల్ల మనకి వేసవికాలంలో ఎండ నుండి ఉపశమనం లభించడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు కలుగుతుంది. కూల్ డ్రింక్స్ తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడానికి బదులుగా ఇలా ఇంట్లోనే లస్సీని తయారు చేసుకుని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: