ఎలాంటి అలవాట్లు వల్ల గ్రే హెయిర్ వస్తుందో తెలుసా..?

Divya
పూర్వం రోజుల్లో వయసు మళ్ళిన వారికి మాత్రమే గ్రే హెయిర్ వచ్చేది.కానీ ఇప్పుడున్న ఆహార అలవాట్లు
మారిన జీవనవిధానం,పెరిగిన ఒత్తిడి కారణంగా జుట్టు తెల్లబడడం,రాలడం, చుండ్రు మొదలైన జుట్టు సమస్యలు అధికంగా వస్తున్నాయి.కానీ కొంతమంది పిల్లల్లో, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంటుంది. దానికి కారణం వారు తినే ఆహారం కూడా గ్రే హెయర్ రావడానికి దోహదం చేస్తుందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వారు అవగాహనా లోపంతో కొన్ని రకాల ఆహారాలను అతిగా తీసుకోవడం వల్ల గ్రే హెయిర్ వస్తోందని నిపుణులు చెబుతున్నారు.వారు ఏయే పదార్థాలను అతిగా తీసుకోవడం వల్ల జుట్టు తెల్లబడుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..
కూల్ డ్రింక్స్:వేసవిలో పిల్లలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ త్రాగటానికి ఇష్టపడతారు.కానీ తరుచూ తీసుకోవడం వల్ల ఈ డ్రింక్స్‌లో అధిక మొత్తంలో ఉన్న సోడా,షుగర్ .. జుట్టు పెరగడానికి కావాల్సిన విటమిన్లను శరీరం శోషణ చేసుకోకుండా అడ్డుపడతాయి.దీని కారణంగా జుట్టు తొందరగా చిన్న వయసులోనే తెల్లబడుతుంది.
స్వీట్ లు :చక్కెర అధికంగా ఉన్న స్వీట్లు,ఇతర ఆహారాలను ఎక్కువగా తీసుకొనేవారికి కూడా జుట్టు తొందరగా తెల్లబడుతుంది.షుగర్ అధికంగా తీసుకోవడంతో 'విటమిన్ ఈ ' శోషించకుండా అడ్డుపడి, జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
మోనోసోడియం గ్లూటమేట్: మోనోసోడియం గ్లూటమేట్ నా మైదా పిండితో తయారు చేసిన బిస్కెట్స్, కేక్ వంటలను తరచూ తీసుకోవడం వల్ల కూడా జుట్టు తొందరగా తెల్లబడుతుంది.మైదాపిండిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చి హార్మోనల్ సమస్యలు తలెత్తుతాయి.దీనికి కారణం మోనోసోడియం గ్లూటమేట్ శరీర జీవక్రియ రేటుపై ప్రభావం చూపుతుంది.అంతేకాక జుట్టు సమస్యలను కూడా అధికం చేస్తుంది.
ఉప్పు:జంక్ ఫుడ్ లలో రుచి కోసం వాడే ఉప్పు ఎక్కువగా తిన్నా కూడా జుట్టు తెల్లబడుతుంది. ఉప్పును అధికంగా తీసుకొనేవారిలో శరీరంలోని ద్రవాలు నియంత్రణ కోల్పోతాయి.దాని ప్రభావం వల్ల జుట్టు కూడా తొందరగా తెల్లబడుతుంది.ఉప్పులో ఉండే సోడియం శరీరంలో ఎక్కువగా చేరితే జుట్టు సమస్యలే కాక , కిడ్నీ పనితీరు కూడా దెబ్బతింటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: