గ్యాస్, ఎసిడిటిని సులభంగా మాయం చేసే మార్గాలు?

Purushottham Vinay
ఈ రోజుల్లో మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, తరచూ ఆహారాన్ని తీసుకోవడం, మలబద్దకం ఇంకా ఆమ్లత్వం కలిగి ఉండే ఆహారాన్ని తీసుకోవడం వంటి ఎన్నో కారణాల వలన  గ్యాస్, ఎసిడిటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు తలెత్తగానే చాలా మంది మందులను ఇంకా సిరప్ లను తాగుతూ ఉంటారు. వీటి వల్ల తాత్కాలిక ఉపశమనం కలిగినా కూడా వీటిని ఎక్కువగా వాడడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు తలెత్తుతాయి.ఇప్పుడు చెప్పే సహజ సిద్ద చిట్కాలను ఉపయోగించి ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో పాలు, నెయ్యి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 20 ఎమ్ ఎల్ కాచి చల్లార్చిన పాలు ఇంకా ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి కలిపి తాగాలి.ఎసిడిటీ సమస్య తలెత్తినప్పుడు ఈ టిప్ ని వాడడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. అయితే నెయ్యి తీసుకోవడం ఇష్టంలేని వారు భోజనం చేసిన తరువాత చల్లటి పాలను తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది.


అలాగే మనకు తేలికగా లభించే పదార్థాలతో ఒక పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల కూడా ఎసిడిటీ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. ఈ పొడిని తయారు చేసుకోవడానికి  పసుపు, నల్ల ఉప్పు, జీలకర్ర, నిమ్మకాయను వాడాల్సి ఉంటుంది. ముందుగా ఒక కళాయిలో జీలకర్రని వేసి వేడి చేయాలి.జీలకర్ర చక్కగా వేగిన తరువాత దానిని జార్ లో వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు ఇంకా అర టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు వేసి కలపాలి. ఆ తరువాత దీనిలో వేడి చేసిన అర చెక్క నిమ్మరసం వేసి కలపాలి. నిమ్మరసాన్ని వేడి చేయడానికి ముందుగా ఒక నిమ్మకాయను కట్ చేసి దానిని నేరుగా మంటపై ఉంచి ఒక 30 నుండి 40 సెకన్ల పాటు వేడి చేయాలి.ఆ తరువాత ఈ నిమ్మకాయ నుండి రసాన్ని పిండుకొని వాడుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ఎసిడిటీ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు తీసుకోవడం వల్ల వెంటనే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు లేకుండా ఎసిడిటీ సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: