నేరేడు పండ్ల వల్ల కలిగే ఉపయోగాలు ..!

Divya

నేరేడు పండు వేసవికాలంలో మాత్రమే దొరికే పండల్లో ఇది ఒకటి.ఇది రుచికి తీపి మరియు వగరు కలిసినట్టు ఉంటుంది.దీనిని ఇంగ్లీషులో జామున్ అని కూడా అంటారు.నేరేడును ఆరోగ్యప్రదాయని అని అంటూ ఉంటారు.దీనికి కారణం ఇందులో ఉన్న సుగుణాలే. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి,ఎన్నో వ్యాధులు దరిచేరకుండా సహాయపడుతుంది.అందుకే వీటిని ఎక్కడ కనిపించినా తెచ్చి తినమని వైద్యులు సూచిస్తూ ఉన్నారు.అన్ని ఆరోగ్య సుగుణాలు ఉన్న నేరేడు పండ్ల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
 
వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
నేరేడు పండులో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల,రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా చాలా బాగా పనిచేసి,అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.అంతేకాక ఇందులోని యాంటీ డయాబెటిస్ గుణాలు అధికంగా ఉండడం వల్ల,రక్తంలోని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది.కనుక షుగర్ పేషంట్లకి ఇది వరం అని చెప్పవచ్చు.ఇందులోని యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఆర్థరైటిస్,క్యాన్సర్,కణుపులు వంటివి రాకుండా సహాయపడతాయి.పిల్లలు ఎవరైనా పొరపాటున వెంట్రుకలు మింగితే,వారికి నేరేడు పండ్లను తినిపించడం వల్ల,వాటికీ వెంట్రుకలు కోసేసి బయటకు పంపేందుకు ఉపయోగపడతాయి.


వేసవిలో కలిగే వేడిని తగ్గించడానికి జామున్ రసం తీసుకోవడం చాలా మంచిది.అంతే కాక యూరినరి ఇన్ఫెక్షన్ ను కూడా తగ్గిస్తాయి.అనిమియాతో బాధపడేవారికి వీటిని అధికంగా ఇవ్వడం వల్ల,శరీరంలో రక్త శాతం పెరిగి, వారు బలంగా తయారవుతారు.మరియు గుండె పనితీరును మెరుగుపరిచి,రక్త సరఫరా సక్రమంగా జరిగేందుకు సహాయపడతాయి.వేసవిలో ప్రజలు ఎక్కువగా గురయ్యే విరేచనాలను తగ్గించుకోవడానికి,మూడు చెంచాల నేరేడు రసంతో,తేనె కలిపి ఇవ్వడం వల్ల ఉపశమనం కలుగుతుంది.నేరేడు పండు ఆరోగ్యానికే కాక,అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలను మచ్చలను తొందరగా తగ్గిస్తాయి.మరియు ముడతలు పోగొట్టి తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండ సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: