రక్తహీనత బారిన పడకుండా ఉండాలంటే..?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా రక్తహీనతతో ఎంతగానో సతమతం అవుతున్నారు. రక్తహీనత కారణంగా అలసట, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి ఇంకా అలాగే శరీరం చల్లగా ఉండటం వంటి లక్షణాలతో బాధ పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 33 శాతం గర్భిణీ స్త్రీలు ఇంకా 42% మంది పిల్లల్లో ఐరన్ లోపం ఉన్నట్లు కనుగొన్నారు. ఐరన్-డెఫిషియన్సీ ని అనీమియా అని కూడా అంటారు.ఇండియాలో 6 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు అనీమియాతో ప్రభావితం అవుతున్నారని పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మహిళలు తమ రోజువారీ ఆహారంలో ఐరన్ తీసుకోవడం ఖచ్చితంగా చాలా అవసరం. మీ ఆహారాన్ని ఐరన్-రిచ్ ఫుడ్స్‌ తీసుకోవడం ద్వారా అనీమియాను ఈజీగా తగ్గించవచ్చు.


సిట్రస్ పండ్లు, నిమ్మకాయలు, ఉసిరికాయలు, టొమాటోలు, జామకాయలు, కివి, పుచ్చకాయలు, ఆకుకూరలు ఇంకా అలాగే క్యాప్సికమ్ వంటి వాటిల్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఐరన్ ను బాగా గ్రహించడంలో ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారంలో నిమ్మకాయ రసం ఒక టీస్పూన్ ని జోడించడం ద్వారా బోలెడు సి. విటమిన్ అనేది మీ సొంతం అవుతుంది.అలాగే ఉసిరి చట్నీ తినడం ద్వారా కూడా విటిమన్ సి ని మీరు ఈజీగా పొందవచ్చు.ఇంకా అలాగే విటమిన్ A శరీరంలో ఐరన్ ను విడుదల చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. అందువల్ల శరీరంలో ఈ విటమిన్ తగినంత మొత్తంలో అనీమియాను నివారించడంలో ఖచ్చితంగా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ A కావాలంటే క్యారెట్, చిలగడదుంపలు, బచ్చలికూర, ఎర్ర మిరియాలు, పాలు, కోడి గుడ్లు, నారింజ ఇంకా చేపలు తినాలి. ఎందుకంటే వీటిల్లో విటమిన్ A చాలా పుష్కలంగా ఉంటుంది.కాబట్టి రక్త హీనత బారిన పడకుండా వుండాలంటే ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ ని పాటించండి. ఆరోగ్యంగా వుండండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: