గాంధీజి జీవన విధానం సంపూర్ణ ఆరోగ్యకరం!

Purushottham Vinay
మన దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో మహాత్మా గాంధీ గారు తెల్ల వారితో చేసిన పోరాటాన్ని మరువలేము. అందుకే భారతీయులంతా కూడా జాతిపితగా ఆయనను కొలుస్తారు. భారతదేశ అభివృద్ధికి కూడా ఆయన సూచించిన ఎన్నో విషయాలను ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం.గాంధీ గారి జీవన విధానం శారీరకంగా చురుకుగా ఉండడంతో పాటు వీలైనంత ఎక్కువగా బహిరంగ ప్రదేశంలో నడవడం ఇంకా ప్రాణాయామం సహాయంతో లయబద్ధమైన శ్వాస తీసుకోవడం అలాగే సాయంత్రం వేళల్లో సూపర్ లైట్ వ్యాయామాలు ఇంకా బిజీ షెడ్యూల్‌ల మధ్య విశ్రాంతి తీసుకోవడం, ఇవి అన్నీ కూడా చాలా ప్రశాంత ప్రభావాన్ని కలిగి ఉంటాయి. బహిరంగంగా శుభ్రమైన ప్రదేశంలో నిద్రించడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.గాంధీ గారి జీవన విధానం ఎలా ఉండేదంటే..తగినంత గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా మన రోజును ప్రారంభించాలి. ఇలా చేస్తే రక్త నాళాలను సులభంగా విస్తరిస్తాయి. కండరాలు ఇంకా అవయవాలకు రక్త ప్రసరణను బాగుంటుంది.ఇంకా అల్లం, హెర్బల్, గ్రీన్ టీ ఖచ్చితంగా తాగాలి.


అల్లం  గుండె ఆరోగ్యానికి చాలా మంచిది,. అల్లం కొలెస్ట్రాల్‌ను ఖచ్చితంగా 17 శాతం తగ్గిస్తుంది. ఇంకా అలాగే ట్రైగ్లిజరైడ్‌లను కూడా తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది.ఇక సీజనల్‌గా దొరికే పండ్లను కూడా ఎక్కువగా తీసుకోవాలి . వీటన్నింటిలో ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి . అలాగే వీటిల్లో సహజ చక్కెర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తీసుకునే సమయంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.ఇంకా భోజనానికి 20 నిమిషాల ముందు ఒక గిన్నె సలాడ్ ని తినాలి. దీంతో శరీరానికి అవసరమైన ఫైబర్ అందడంతో పాటు ఎక్కువ తినకుండా సాయం చేస్తుంది.ఇంకా భోజనంలో పప్పుతో పాటు మిల్లెట్ ఆధారిత రోటీని ఖచ్చితంగా తినాలి. మీరు అన్నమే తినాలి అనుకుంటే పాలిష్ చేయని బియాన్ని వండుకోవాలి. అలాగే భోజనంలో కచ్చితంగా పెరుగు ఉండేలా చూసుకోవాలి.ఈ జీవన విధానం పాటిస్తే ఖచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: