ఎండాకాలంలో ఖచ్చితంగా తాగాల్సిన డ్రింక్?

Purushottham Vinay
ఎండాకాలం మొదలైంది. ఖచ్చితంగా మనపై ఎండల ప్రభావం ఉంటుంది. శరీరానికి అధిక వేడి అంత మంచిది కాదు. శరీరం నుంచి అధిక వేడి ఈజీగా బయటకి పోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే టిప్ ని పాటించాలి. ఇక మన ఇంట్లోనే ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల ఎండ నుండి ఈజీగా ఉపశమనాన్ని పొందడంతో పాటు తక్షణ శక్తిని పొందవచ్చు.అంతేకాకుండా ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలే తప్ప అసలు ఎలాంటి హాని కూడా కలగదు.ఇక ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనం కలబంద గుజ్జును, తేనెను, నిమ్మరసాన్ని, అల్లం ముక్కలను ఇంకా అలాగే రోజ్ యాపిల్ లను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో ఒక పెద్ద ముక్క కలబంద తీసుకుని దాన్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఆరు రోజ్ యాపిల్ లను కూడా కట్ చేసి వేసుకోవాలి. తరువాత ఒక ఇంచు అల్లాన్ని ముక్కలుగా చేసి అందులో వేసుకోవాలి.ఇక ఇప్పుడు ఈ రెండింటిలో కొద్దిగా నీళ్లు పోసి వాటిని మెత్తగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి.


ఆ తరువాత ఈ జ్యూస్ ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో తగినన్ని చల్లటి నీళ్లను పోసుకుని బాగా కలపాలి. ఆ తరువాత అందులో రుచికి తగినంత తేనె ఇంకా నిమ్మరసం వేసి శుభ్రంగా కలపాలి. ఇలా చేయడం వల్ల మనకు కావాల్సిన ఎనర్జీ డ్రింక్ తయారవుతుంది. ఇక వేసవికాలంలో మీరు బయటకి వెళ్లి తిరిగి వచ్చిన తరువాత ఇలా డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల  మీకు చక్కటి రుచితో పాటు చక్కటి మీరు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.ఇక ఈ పానీయాన్ని ఏ వయసు వారైనా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. ఇక మార్కెట్ లో దొరికే శీతల పానీయాలను తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే ఇలా ఇంట్లోనే ఈ ఫ్రెష్ ఎనర్జిటిక్ డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం ఆరోగ్యానికి చాలా రకాలుగా మంచిది.కాబట్టి ఖచ్చితంగా ఈ జ్యూస్ తాగండి. ఎండ నుంచి ఉపశమనం పొంది. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: