గ్యాస్ట్రిక్ సమస్యలు పారిపోవాలంటే..?

Purushottham Vinay
మన వంటింట్లో ఉండే పదార్థాలను వాడుకొని అసలు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సహజ సిద్దంగా మనం గ్యాస్ట్రిక్ సమస్యను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.ఇక గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వారు ఖచ్చితంగా సోంపు టీ ని తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య నుండి మంచి ఈజీగా ఉపశమనాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఒక కప్పు నీటిలో ఒక టీ స్పూన్ సోంపు గింజలను వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా సోంపు టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం ఇంకా అలాగే గుండెల్లో మంట వంటి లక్షణాల నుండి చాలా ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఆకలి శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఎండిన చామంతి పూలతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యల నుండి చాలా వేగంగా మనం ఉపశమనాన్ని పొందవచ్చు.

ఇంకా అలాగే మీరు నీటిలో ఎండిన చామంతి పూలను వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇలా ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున ఇంకా అలాగే రాత్రి పడుకునే ముందు తాగాలి. చామంతి టీ ని తాగడం వల్ల గ్యాస్, అజీర్తి ఇంకా అలాగే కడుపు ఉబ్బరం వంటి సమస్యలను చాలా వేగంగా తగ్గించుకోవచ్చు. ఇంకా అదే విధంగా గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు చక్కెర కలపని అలాగే కొవ్వు లేని ఒక గ్లాస్ చల్లటి పాలను తాగడం వల్ల ఈ సమస్య నుండి ఖచ్చితంగా మంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా అలాగే పాలల్లో ఉండే క్యాల్షియం ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారాత్వాన్ని కూడా పెంచుతుంది. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యల నుండి వెంటనే మీకు మంచి ఉపశమనం కలుగుతుంది.ఇంకా అదే విధంగా మజ్జిగలో జీలకర్ర పొడి, నల్ల ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల కూడా గ్యాస్, అజీర్తి ఇంకా అలాగే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఈజీగా తగ్గు ముఖం పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: