ఉల్లికాడలతో బోలెడు లాభాలు..ఎలా అంటే..?

Divya
సాధారణంగా ఉల్లిపాయలలో ఎన్నో ఉపయోగకరమైన పోషకాలు దాగి ఉన్నాయి. నిజానికి మన పెద్దలు ఒక్కమాటలో ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటూ చెబుతూ ఉంటారు.. సాధారణంగా ఎన్నో వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఉల్లిపాయ కూరలకు రుచులను రెట్టింపు చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది. అందుకే భారతీయ వంటశాలలో ఉల్లిపాయ తప్పనిసరిగా ప్రత్యేక ప్రాధాన్యతను సంపాదించుకుందని చెప్పవచ్చు. ఇకపోతే ఉల్లిపాయలతోనే కాదు దాని మొలకలతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ మొలకలనే ఉల్లికాడలు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటినే స్ప్రింగ్ ఆనియన్స్ అని కూడా పిలవడం మనం వినే ఉంటాం..
కొంతమంది ఉల్లిపాయలు తినడానికి ఆసక్తి చూపరు..  అలాంటివారు ఉల్లిపాయలకు బదులుగా ఉల్లికాడలను ఉపయోగించవచ్చు. ఇది ఘాడత తక్కువగా ఉండటమే కాదు మంచి రుచితో ఉల్లిపాయలకు సరైన ప్రత్యామ్నాయమని చెప్పవచ్చు.. కొన్ని ప్రాంతాలలో కరివేపాకు కొత్తిమీర లాగా వీటిని అన్ని కూరల్లో కూడా వేసుకుంటారు. ఖరీదు తక్కువగా ఉండే ఈ ఉల్లికాడల వల్ల మనకు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి..
ఉల్లికాడలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు పెరుగుతారనే సమస్య ఉండదు. మలబద్దక సమస్య కూడా దూరమై తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.. ఆకలి అదుపులో ఉంటుంది. ఉల్లికాడలలో సల్ఫర్ అధికంగా ఉంటుంది కాబట్టి శరీరంలోని కొలెస్ట్రాల్ ను, హై బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. ఉల్లికాడలలో ఉండే పెక్టిన్ అనే పదార్థం పెద్ద పేగులోని సున్నితమైన పొరలను రక్షించడంలో సహాయపడుతుంది దీంతో పెద్ద పేగు దెబ్బ తినకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా రాకుండా నివారించవచ్చు. ముఖ్యంగా ఫైల్స్ సమస్యతో బాధపడేవారు ఒక చిన్న బౌల్లో కొద్దిగా పెరుగు వేసి అందులో ఉల్లికాడ ముక్కలను కలిపి.. రోజుకు రెండుసార్లు తింటే పైల్స్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాదు పైల్స్ వల్ల వచ్చే వాపులు నొప్పి మంట వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: