పడుకునే ముందు ఈ పండ్ల ను తింటున్నారా.. జాగ్రత్త..!!

Divya
సాధారణంగా మనం తీసుకునే ఆహారంతో పాటు,పండ్లు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కొంతమంది బరువు తగ్గాలని అదే పనిగా,డైట్లో పండ్లను ఒక పూట భోజనం గా తీసుకుంటూ ఉంటారు. పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల, మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలు, పోట్రీన్లు పుష్కళంగా లభిస్తాయి.అందుకే పండ్లను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తుంటారు. కానీ కొన్ని రకాల పండ్లు కొన్ని సమయాల్లో మాత్రమే తినాలనే అవగాహన చాలామందికి ఉండదు. ఆహార నిపుణులు అభిప్రాయం ప్రకారం,కొన్ని రకాల పండ్లు రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు.అలాంటి పండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
బనానా..
పడుకోబోయే ముందు అరటిపండు తినకూడదని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట మనం తిన్న భోజనంతో పోలిస్తే అరటిపండు తొందరగా జీర్ణమై, ఆహార పదార్థాలు ఆలస్యంగా జీర్ణం అవుతాయి. దీనితో తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక, మలబద్దకం,గ్యాస్,అజీర్తి సమస్యలు కలుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అంతే కాక రాత్రి పూట అరటిపండు తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుంది.
యాపిల్..
రాత్రి సమయంలో యాపిల్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే అక్జాలిక్ యాసిడ్, మనము తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవకుండా చేస్తుందట.దీనితో ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సపోటా..
సపోటాల్లో అధిక చక్కెరలు ఉంటాయి. దీన్ని రాత్రిపూట  తీసుకోవడం వల్ల,ఇందులోని చక్కెరలను అధికంగా ఊత్పత్తి చేసి,రక్తంలో తొందరగా కలిసిపోతాయి.దీనితో మన రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తాయి.
సిట్రస్ ఫ్రూట్స్..
సిట్రస్ ఫ్రూట్స్ అయిన ఆరెంజ్,ద్రాక్ష, పైనాపిల్  వంటి వాటిలో ఆమ్లాన్ని అధికంగా ఊత్పత్తి చేసే గుణం ఉంటుంది.ఈ పండ్లను తినడం వల్ల,కడుపులో గ్యాస్, ఎసిడిటీ వచ్చే అవకాశాలను అధికం చేస్తాయి.
అంతే కాక ఈ ఆమ్ల పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల,గుండె దడను పెంచి, రాత్రి సమయంలో నిద్ర పట్టకుండా చేస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: