ముఖంపై నల్లటి వలయాలు తగ్గాలంటే ఇవి తినండి?

Purushottham Vinay
కంటి కింద ఏర్పడే నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే వాటి వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దాని ఫలితంగా చర్మం చాలా హెల్దీగా ఉంటూ రీఫ్రెష్ అవుతుంది. పాలకూర, బచ్చలికూర ఇంకా బ్రకోలీ వంటి వాటిలో విటమిన్ K అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను బాగా పెంచి.. చర్మ రంగు పాలిపోవడాన్ని ఇంకా కళ్ల కింద ఉబ్బులను ఈజీగా తగ్గిస్తుంది.అలాగే దోసకాయలలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. దోసకాయను ఆహారంలో చేర్చుకుంటే, కాంతివిహీనంగా మారిన చర్మం తిరిగి మంచి మెరుపును సంతరించుకుంటుంది. ఇది కొల్లాజెన్ ఏర్పడటాన్ని బాగా మెరుగుపరుస్తుంది. వీటిలో A, E, C, K విటమిన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి రక్తనాళాలను బాగా శుద్ధి చేస్తాయి. అందుకే దోసకాయలను క్రమం తప్పకుంటూ తింటే, డార్క్ సర్కిల్స్ సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది.అలాగే బొప్పాయి పండ్లలో విటమిన్ A చాలా సమృద్ధిగా ఉంటుంది. ఎన్నో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్‌ దీని సొంతం. అందుకే ఈ బొప్పాయి పండు కంటి కింద నల్లటి వలయాలను తగ్గించే బెస్ట్ ఫుడ్‌గా నిలుస్తోంది.


ఇది చర్మాన్ని క్లియర్ చేయడంతో పాటు కళ్ల చుట్టూ ఉన్న డార్క్ ప్యాచ్‌లను ఈజీగా తొలగించే నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్‌గా కూడా ఇది పనిచేస్తుంది.ఇంకా టమోటాలు విటమిన్ C, పొటాషియం అలాగే విటమిన్ K వంటి పోషకాలకు నిలయాలు. ఇవి శరీరంలో రక్త ప్రసరణను చాలా బాగా మెరుగుపరుస్తాయి. దీంతో కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన చర్మానికి రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. వీటిలో లైకోపిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ చాలా పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్త నాళాలను కూడా సంరక్షిస్తుంది. ఇవన్నీ చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల డార్క్ సర్కిల్స్ ఈజీగా నయం అవుతాయి.అలాగే బీట్‌రూట్‌లో బీటాలైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరాన్ని బాగా డిటాక్సిఫై చేస్తుంది. దీంతో శరీరంలోని వ్యర్థాలు అన్ని ఈజీగా బయటకు పోతాయి.అయితే బీట్‌రూట్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.దీంట్లో ఉండే విటమిన్ సి, మెగ్నీషియం ఇంకా అలాగే పొటాషియం వంటివన్నీ కళ్ల కింద నల్లటి వలయాలను చాలా ఈజీగా తగ్గిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: