తెల్ల జుట్టును న్యాచురల్ గా నల్లగా మార్చుకోవాలంటే..?

Purushottham Vinay
చాలా మంది కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి హెయిర్ డై లను ఇంకా అలాగే షాంపులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల జుట్టు నల్లబడినప్పటికి జుట్టు రాలడం, జుట్టు పొడి బారడం, అలర్జీ ఇంకా అలాగే వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే హెయిర్ డై లనే కాకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా మనం ఈ సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి  మనం రెండు బొప్పాయి చెట్టు ఆకులను, 5 బిర్యానీ ఆకులను, 5 లవంగాలను, ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ ను ఇంకా అలాగే తగినంత హెన్నా పౌడర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక ముందుగా బొప్పాయి ఆకులను తీసుకొని వాటిని బాగా శుభ్రంగా కడగాలి.ఆ తరువాత వాటిని ముక్కలుగా చేసి ఒక జార్ లోకి తీసుకోని తరువాత ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.తరువాత ఈ మిశ్రమాన్ని బాగా వడకట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత మరో గిన్నెలోకి ఒక గ్లాస్ నీళ్లు, బిర్యానీ ఆకులు, లవంగాలు ఇంకా అలాగే కాఫీ పౌడర్ వేసి బాగా మరిగించాలి. వీటిని అర గ్లాస్ అయ్యే దాకా బాగా మరిగించి వడకట్టుకుని గిన్నెలోకి తీసుకోని ఇప్పుడు ఇనుప కళాయి లేదా గిన్నెను తీసుకుని అందులో జుట్టుకు తగినంత హెన్నా పౌడర్ ను వేసుకోవాలి.


ఆ తరువాత ఇందులో బొప్పాయి ఆకుల రసం ఇంకా అలాగే బిర్యానీ ఆకుల డికాషన్ ను వేస్తూ పేస్ట్ లా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి ఒక 5 గంటల పాటు అలాగే ఉంచాలి. 5 గంటల తరువాత ఈ పేస్ట్ ను మరోసారి కలుపుకుని జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివరి దాకా బాగా పట్టించాలి.ఇక దీనిని ఒక గంట పాటు జుట్టుకు అలాగే ఉంచి ఆరిన తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి.అయితే ముందుగా షాంపు వాడకుండా తలస్నానం చేయాలి.తరువాత మరుసటి రోజు షాంపుతో తలస్నానం చేయాలి. ఈ విధంగా ఈ టిప్ ని నెలకు రెండు సార్లు వాడడం వల్ల తెల్ల జుట్టు ఈజీగా నల్లగా మారుతుంది.అలాగే జుట్టు నల్లగా, ఒత్తుగా ఇంకా అలాగే ధృడంగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం, చుండ్రు ఇంకా అలాగే జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. తెల్లజుట్టు సమస్యతో బాధపడే వారు ఈ టిప్ పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: