షుగర్ పేషెంట్లు గోధుమలు, బియ్యం తినకపోవడం మంచిదా..?

Divya
షుగర్ పేషెంట్లు ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ వస్తూనే ఉన్నది. అయితే ఇలాంటి సమయంలో గోధుమలను బియ్యాన్ని ఎక్కువగా తినకూడదట ఎందుచేత అంటే వీటిలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవి మధుమేహ రక్తంలో చక్కెర స్థాయిని అమాంతం పెంచేస్తాయని తెలుపుతున్నారు. అందుచేతనే వీళ్ళు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం మంచిదట. అందుచేతనే గోధుమలు, బియ్యానికి బదులుగా ఇతర వాటినే తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

డయాబెటిస్ అనేది జీవనశైలి వల్ల వచ్చే వ్యాదని చెప్పవచ్చు. ఇన్సులిన్ స్థాయి రక్తంలో చక్కెర స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పుడు షుగర్ వ్యాధి బారిన పడతారట. చెడు ఆహారపు అలవాట్లు.. నిత్యాల జీవనశైలి కారణంగా నేడు ఎంతోమంది టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నారని ఒక అధ్యయనంలో తెలియజేయడం జరుగుతోంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది. కానీ ఇలా తినేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందు చేత అంటే మనం వంటలలో పిండి పదార్థాలు చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉండే వాటిని ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నాము.

తక్కువ కార్బోహైడ్రేట్లు ఎక్కువ ప్రోటీన్లు ఉండే బ్రేక్ ఫాస్ట్ ను తింటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. గోధుమలు, బియ్యం కాకుండా తక్కువ క్యాలరీలు కలిగిన తక్కువ కార్బోహైడ్రేట్లో ఉన్న రాగులు, సజ్జలను తినడం మంచిది. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా వీటితో రొట్టెలను కూడా తయారు చేసుకుని తినడం వల్ల మల్టీ గ్రీన్ ఓట్స్ గా పనిచేస్తుంది. ఇక అంతే కాకుండా మొలక వచ్చిన వాటిని కలిపి కూడా ఇందులో తినవచ్చు.. అని నిపుణులు తెలుపుతున్నారు. సద్దలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది అంత త్వరగా జీర్ణం కాదు దీంతో రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగే అవకాశం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: