విటమిన్ డి లోపం ఉంటే ఖచ్చితంగా ఇవి తినండి?

Purushottham Vinay
ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా విటమిన్ డి అనేది మన శరీరానికి అందాలి.ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ కారణంగా చాలా ఎక్కువగా పని ఉంటుంది.దీని కారణంగా మనం గంటల తరబడి డెస్క్ వర్క్ అనేది చేస్తాం లేదా ముఖ్యమైన పనిని నిర్వహించడంలో చాలా బిజీగా ఉంటాము, దీని కారణంగా విటమిన్ డి సహజ వనరులు మనకు అందవు. కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపాన్ని సులభంగా తీర్చుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు. విటమిన్ డి లోపాన్ని మనం ఏయే ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల తీర్చగలమో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.విటమిన్  డి లోపాన్ని భర్తీ చేసేందుకు ఆవు పాలు వంటి కొన్ని సాధారణ ఆహారాలు, సోయా, బాదం, నారింజ రసం, సిద్ధంగా ఉన్న తృణధాన్యాలు, పెరుగు ఇంకా అలాగే టోఫు వంటి మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి రకాలుగా మేలు చేస్తుంది.ఇంకా అలాగే గుడ్డు పచ్చసొన అనేది విటమిన్ డి గొప్ప మూలం, మీరు దీన్ని మీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు.


గుడ్డు పచ్చసొనలో ఉండే విటమిన్ డి ఎముకల అభివృద్ధికి మరియు ఆరోగ్యకరమైన కండరాలకు ఇంకా అలాగే రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి చాలా రకాలుగా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి రోజుకు ఒకటి నుండి రెండు గుడ్లు తీసుకోవడం చాలా మంచిది.ఇంకా అలాగే పుట్టగొడుగులలో ఉండే గ్లూకోజ్, ప్రొటీన్, బీటా కెరోటిన్, విటమిన్లు ఇంకా కాల్షియం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేగాక విటమిన్ డి లోపాన్ని కూడా తీరుస్తాయి. ఈ పుట్టగొడుగులను ఎక్కువగా తినడం ద్వారా, విటమిన్ డి లోపం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. శరీరానికి అనేక రకాల పోషకాలు కూడా అందుతాయి.ఇంకా అలాగే శరీరంలో విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి, సీ ఫుడ్స్ ఖచ్చితంగా తినండి. ట్యూనా, మాకేరెల్, గుల్లలు, రొయ్యలు, సార్డినెస్ వంటి విటమిన్ డి చాలా ఎక్కువగా ఉండే వివిధ రకాల చేపలను ఖచ్చితంగా మీరు తినండి. విటమిన్ డి లోపాన్ని తీర్చడంలో సీ ఫుడ్ అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: