బాదం: అతిగా తింటే తప్పవు తిప్పలు?

Purushottham Vinay
బాదం : బాదం పప్పు ఆరోగ్యానికి మంచిది.ఎందుకంటే ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి చాలా ముఖ్యమైనవి. ఇవి గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో చాలా బాగా పని చేస్తుంది.ఇంకా అలాగే ఇది LDL కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా అదేవిధంగా, బాదం మధుమేహ రోగులకు మంచి దివ్యౌషధంలా పనిచేస్తుంది.అయితే ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా కానీ ఎక్కువగా తింటే మాత్రం ఖచ్చితంగా అనేక రకాల సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఇక బాదంపప్పులో హైడ్రోసియానిక్ యాసిడ్ అనేది ఉంటుంది. మన శరీరంలో అధిక మొత్తంలో HCN ఉంటే, అది శ్వాస సంబంధిత సమస్యలను ఖచ్చితంగా కలిగిస్తుంది. అందుకే బాదంపప్పులను సమతులంగా తీసుకోవడం మంచిది. లేదంటే సమస్యలు తప్పవు.


బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణం, ఎసిడిటీ ఇంకా అలాగే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు డయేరియా సమస్య కూడా రావచ్చు.ఇక ఈ బాదంపప్పులో అమాండిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రొటీన్ వల్ల చాలా మందికి కూడా అనేక రకాల అలర్జీ సమస్యలు రావచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అలెర్జీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ఈ బాదంపప్పును తీసుకోవాలి.ఇంకా అలాగే బాదంపప్పులో ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది, ఇది చాలా గట్టిగా ఉండి కిడ్నీలో పేరుకుపోవడం జరుగుతుంది. ఓ సైన్స్ పత్రికలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఆక్సలేట్ అనేది మన మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. మీకు కనుక ఇప్పటికే కిడ్నీలో రాళ్ళ సమస్య కనుక ఉంటే వెంటనే ఈ బాదంపప్పుని తినడం మానుకోండి.కాబట్టి బాదం పప్పుని మితంగా తీసుకోండి. ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా పైన చెప్పబడిన సమస్యలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: