లైఫ్ స్టైల్: పురుషులు అందంగా కనపడాలంటే ఈ ఎక్సర్సైజులు చేయాల్సిందే..!!

Divya
ప్రస్తుత కాలంలో శారీరక శ్రమలేక అధిక బరువు పెరిగిపోతామేమోనని ఆడవారు,మగవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందం,ఆరోగ్యం, ఫిట్నెస్ పై అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ముఖ్యంగా మగవాళ్లు ఫిట్నెస్ గా,అందంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. వారి అందం కోసము ఎక్సర్సైజులు జిమ్ములు అంటూ తిరుగుతూ ఉంటారు. ఎక్సర్సైజుల వల్ల మన శరీరం ఫిట్నెస్ గా ఉండటమే కాకుండా, శరీరానికి కావాల్సిన ఎనర్జీ కూడా వస్తుంది.
 అంతేకాకుండా రోజూ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగు పడుతుందనె అన్న అవగాహన చాలామందికి ఉండదు. శరీర ఆకృతి  మార్చుకోవడానికి ఏ రకరకాల వ్యాయామాలు ఉన్నట్టే, అదేవిధంగా జుట్టు, చర్మ సంరక్షణ కోసం కూడా ముఖ్యమైన ఎక్సరసైజులు ఉన్నాయి.
 మనం రోజు చేసే వ్యాయామాలతో నడుము చుట్టు పేరుకుపోయిన కొవ్వు, పొట్ట తగ్గించుకోవడంతో పాటు చర్మం జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ మూడు రకాల వ్యాయామలు చేయడం వల్ల అవి అందాన్ని పెంచడమే కాకుండా శరీరాన్ని ఫిట్నెస్ ఉంచడానికి సహాయపడతాయి. అవే స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్లు, చెస్ట్ ప్రెస్. ఇవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
 ఎక్సర్సైజ్  లో ముఖ్యమైనవి స్క్వాట్స్. ఈ బంగీమ ఒక చోట నిల్చొని, పాదాలు, మోకాళ్లు ఆధారంగా గోడ కుర్చీ వేసినట్టు, వంగుతూ లేవడాన్ని స్క్వాట్స్ అంటారు.ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.రోజూ 20 స్క్వాట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
తర్వాత డెడ్లిఫ్ట్ చేయాలి.అందుకోసం ఒక రాడ్కు డార్బెల్స్, బార్స్ లోడ్ చేసిన దాన్ని ఎత్తడమే డెడ్లిఫ్ట్. నేలపై ఉన్న ఈ బరువును చేతులతో ఎత్తాలి.దీనివల్ల బాడీ వెయిట్ కంట్రోల్ లో ఉంటుంది.
చెస్ట్ పై ఒత్తిడి కలిగే విధంగా చేసే ఎక్సర్సైజ్లను చెస్ట్ ప్రెస్ అంటారు. జిమ్లోని వివిధ పరికరాలతో ఈ చెస్ట్ ప్రెస్ వ్యాయామాలు చేయవచ్చు.ఇది శరీరంలో బ్లడ్ సరఫరా పెరిగేలా చేసి జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: