లైఫ్ స్టైల్: రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే..!!

Divya
 ఇప్పుడున్న వర్షాకాలంలో మనకు రోగ నిరోధక శక్తి చాలా అవసరము. అంటే సీజన్లో మార్పు వలన మన ఇమ్యూనిటీ పవర్ దెబ్బతిని అనేక రకాల ఫ్లూ లు జలుబు, దగ్గు, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.ఇలాంటి సమస్యలు రాకుండా రోగానిరోధక శక్తి మనల్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తి పెంచడానికి కావాల్సిన ఆహారలెంటో ఇప్పుడు చూద్దాం..
1).విటమిన్ సి వున్న ఆహారాలు..
విటమిన్ సి ఉన్న ఆహారాలు గా తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పుల్లగా ఉన్న పొన్నలోను కూరగాయలను విటమిన్ సి అధికంగా ఉంటుంది. నిమ్మ ఆరెంజ్ వంటి వాటిని ఇ సీజన్ లో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల దగ్గు జలుబు రాకుండా నివారిస్తాయి.
 2).ఆపిల్స్..
ఆపిల్  రోజు ఒకటి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది డైజేషన్ సిస్టం మెరుగుపరచి జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాలను కరిగించి అధికబరువు సమస్యను తగ్గిస్తుంది.
3). బీట్రూట్ జ్యూస్..
 రోజు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ యూరిన్, మోషన్ రూపంలో బయటికి పంపించేస్తుంది. ఇందులో యాంటీబ్యాక్టీరియల్,ఆంటీఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
4).పసుపు పాలు..
ఈ వర్షాకాలం పసుపు వేసిన పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి రెండింతలు పెరిగి దగ్గు జలుబు జ్వరం ఇట్టే తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, ఆంటీస్సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి.
5).సలాడ్స్..
ఈ వర్షాకాలంలో పచ్చి కూరగాయల కన్నా కొంచెం ఉడకబెట్టిన కూరగాయలు తినడం వల్ల డైజేషన్ సిస్టం మెరుగుపడి ఎలాంటి పొట్టసమస్యలు రాకుండా చేస్తుంది.
6).అల్లం..
అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా వీటిని తినడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: