ఈ నీరు తాగితే ఎలాంటి రోగాలు దరిచేరవు?

Purushottham Vinay
సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలంటే ఈ నీటిని తాగాలి.ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడాయ్యక 2 టీ స్పూన్ల జీలకర్రను వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసిన జీలకర్ర నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఈ జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఆకలి శక్తి పెరుగుతుంది. ఈ నీటిని తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి. కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయి. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు జీలకర్ర నీళ్లు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల పాలిచ్చే తల్లులల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి.ఈ నీరు షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర నీటిని షుగర్ వ్యాధి గ్రస్తులు రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది. జీలకర్ర నీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. ఫలితంగా దగ్గు, జలుబు, జ్వరం వంటివి త్వరగా నయం అవుతాయి.


ఈ నీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో మనం గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ నీటిని రోజూ తీసుకోవడం వల్ల వాంతులు, వికారం వంటివి తగ్గుతాయి.. ఈ జీలకర్ర నీటిని తాగుతూనే రోజూ వాకింగ్, ధ్యానం చేయడం, పండ్లు మరియు కూరగాయలను తీసుకోవడం, వీలైనంత ఎక్కువగా నీటిని తాగడం వంటివి రోజూ దినచర్యలో భాగం చేసుకుంటే వయసు తక్కువగా కనబడతారు. మూత్రాశయ సమస్యలను తగ్గించే శక్తి కూడా ఈ జీలకర్ర నీటికి ఉంది. ఈ నీటిని తాగడం వల్ల మూత్రపిండాల్లో ఉండే వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు కూడా తొలగిపోతాయి. మూత్రం సాఫీగా వస్తుంది. రోజూ జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు, అల్సర్లు తగ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: