లైఫ్ స్టైల్: షుగర్ వ్యాధిగ్రస్తులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా..?

Divya
సాధారణంగా జీవితంలో ఎవరికైనా ఒకసారి డయాబెటిస్ వచ్చింది అంటే ఇక జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఇక డయాబెటిస్ వచ్చిన తర్వాత ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకపోతే ఇది చాలా ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ను సైలెంట్ కిల్లర్ అని కూడా చెబుతూ ఉంటారు. డయాబెటిస్ వచ్చిన వారు తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదని అసలే వాటికి దూరంగా ఉండాలని సూచిస్తారు. కారణం తీపి పదార్థాలు రక్తంలో చక్కర స్థాయిలను పెంచుతాయి. ఇక కొబ్బరి నీళ్లు తాగవచ్చా అనే సందేహం కూడా చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే ఇవి తీయగా ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కర స్థాయిలో పెరిగే అవకాశం ఉందని కొంతమంది తాగడం మానేస్తూ ఉంటారు. కానీ ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి కొబ్బరి నీళ్లు తాగుతారు.  ఇక ఇవి శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా ఎన్నో ఆరోగ్యకరమైన ఎలక్ట్రోలైట్స్ ను కూడా అందిస్తాయి. కానీ కొబ్బరి నీళ్లు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగడం వల్ల షుగర్ పెరుగుతుందని అపోహ ఉంటుంది.. కొబ్బరినీళ్లు మన ఆరోగ్యానికి ఔషధంతో సమానం.
అధిక బరువు, ఊబకాయం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడే కొబ్బరి నీళ్లు  ఔషదంగా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బాడీ హైడ్రేటుగా ఉంటుంది. ఇక ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రయోజనకరమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఒక డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కూడా కొబ్బరి నీళ్లను తాగవచ్చు.  ఇందులో చక్కెర కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కొబ్బరినీళ్ళతోపాటు ఆ కొబ్బరిని కూడా తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.
కొబ్బరినీళ్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ముఖ్యంగా గ్లైసమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి హాని ఉండదు.  తప్పకుండా కొబ్బరినీళ్ళను డయాబెటిస్ పేషెంట్లు తాగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: