లైఫ్ స్టైల్: చుండ్రు తగ్గాలంటే ఇలా చేస్తే సరి..!!

Divya
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరు కూడా చాలా స్టైలిష్ గా కనిపించాలని చాలా ఆత్రుతగా ఉంటారు. కానీ ఇప్పుడున్న దుమ్ము కాలుష్యం వల్ల .. మరి ఇతర కారణాలవల్ల తలలో చుండ్రు సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఉంటుంది. ఇక అలా చుండ్రు వల్ల తరచు దురద వేస్తూ ఉంటుంది. దీంతో చికాకు వేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇక అంతే కాకుండా వీటికి సరైన నివారణ తీసుకోకుంటే ముఖంపై భుజాలపైన మొటిమలు వంటివి వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ చుండ్రును నివారించడానికి ప్రతి ఒక్కరు అనేక పద్ధతులను పాటిస్తూ ఉంటారు.ముఖ్యంగా మార్కెట్లో దొరికే పలు ప్రాడెక్టులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాటికంటే ఇంట్లో తయారు చేసే హెయిర్ మాస్కులను ఉపయోగించడం వల్ల చుండ్రులు తగ్గించుకోవచ్చట. ఇంట్లో దొరికే పదార్థాలను మనం సులువుగా అలాంటి వాటిని తయారు చేసుకోవచ్చు వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). ముందుగా ఒక గిన్నెలో కొన్ని మెంతులను తీసుకొని వాటిని నానబెట్టాలి అలా మరుసటి రోజు ఆ గింజలను బాగా నూరి అందులోకి కాస్త కొబ్బరి నూనెను కలుపుకొని ఆ మిశ్రమాన్ని వెంట్రుకలకు పట్టించి ఒక అరగంటసేపు అలా ఉంచిన తర్వాత షాంపుతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుందట.
2). ఒక గిన్నెలో పెరుగును తీసుకొని అందులోకి కాస్త ఆలివ్ ఆయిల్ కలుపుకొని ఆ మిశ్రమాన్ని తల కు అప్లై చేసినట్లు అయితే జుట్టు వదులుగా ఉండడమే కాకుండా చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.
3). ఇక మరొక పద్ధతి ఏమిటంటే కాస్త వేప నూనె తీసుకొని అందులోకి నిమ్మరసాన్ని కలిపి.. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించినట్లు అయితే చుండ్రు సమస్య తగ్గుతుంది ఇలా వారానికి కనీసం రెండుసార్లు అయినా చేస్తే.. చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు విముక్తి పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: