లైఫ్ స్టైల్: పుట్టగొడుగులతో ఆయుష్షు పదిలం..!

Divya
ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా సహజంగా లభించే పుట్టగొడుగుల్లో బోలెడన్ని పోషకాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే . అయితే వాటిని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ పుట్టగొడుగులు తినడం వల్ల మన ఆయుష్య పెరగడమే కాకుండా గుండె పదిళంగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పుట్టగొడుగులను శాకాహారులు ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక ఈరోజుల్లో చాలా రకాల వంటకాలలో కూడా పుట్టగొడుగులను ఉపయోగించడం మనం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మష్రూమ్ రైస్, కర్రీ, సూప్, పిజ్జా ఇలా రకరకాల వాటిల్లో పుట్టగొడుగులను ఉపయోగిస్తూ, వూరించే వంటలను చేస్తున్నారు మన వంటకారులు. ఇక విభిన్నమైన వంటకాలకు మష్రూమ్ ప్రసిద్ధిగా మారింది.
పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
పుట్టగొడుగుల్లో ఉండే పాలీశాఖరైడ్ లు చర్మాన్ని డీ హైడ్రేట్ కాకుండా ఉండేలాగా చూస్తాయి. ఇక దీనితోపాటు ఇన్ఫెక్షన్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఇకపోతే పుట్టగొడుగుల్లో రోగనిరోధక శక్తి పెంచే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక పుట్టగొడుగులు పొటాషియం కి మంచి మూలం అని చెప్పవచ్చు. ఇది శరీరంలో సోడియం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో చాలా చక్కగా సహాయపడతాయి. ఇక రక్తనాళాలను సడలిస్తుంది. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండేలాగా పుట్టగొడుగులు కాపాడుతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడేవారు తప్పకుండా వారంలో రెండుసార్లు ఇలా పుట్టగొడుగులను తింటూ ఉంటే అధిక రక్తపోటు సమస్య నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
ఇక శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయి ని నియంత్రించడానికి పుట్టగొడుగులు చాలా బాగా సహాయపడతాయి. ఇందులో ఉండే బీటా గ్లూకాన్ ఒక రకమైన డైటరీ ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో ముందుంటుంది. పుట్టుకడుగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరాన్ని దెబ్బతీసే రాడికల్స్ నుంచి మనల్ని రక్షించడమే కాకుండా గుండె జబ్బులు,  క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు దూరంగా ఉండడానికి సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: