లైఫ్ స్టైల్: బరువు తగ్గాలనుకునేవారు దీని ద్వారా బరువు తగ్గవచ్చు..!!

Divya
బరువు తగ్గడం అనేది చాలా తేలికైన విషయం ఏమీ కాదు.. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడమే కాకుండా వ్యాయామం వంటివి చేయడం కూడా ముఖ్యమే.. బరువు తగ్గించడంలో ఆరోగ్యకరమైన ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా నీరు అధికంగా ఉండే కాయగూరలను తినడం వల్ల శరీరానికి నిర్విషీకరణ చేస్తాయి.. ఇవి శరీరంలోని టాక్సిన్స్ ను కూడా బయటికి పంపుతాయి. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు నీరు అధికంగా ఉన్న కూరగాయలను.. రైతాను  తయారుచేసుకుని తాగితే..ఫిట్నెస్ గా ఉండేలా తమ శరీరాన్ని చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మన కడుపు కూడా నిండిన అనుభూతి కలుగుతుంది. పెరుగులో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. దీనితో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. రైతా ను ఎలాంటి కూరగాయలతో  చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1). బీట్ రూట్  రైతా  ను చాలా కలర్ ఫుల్గా చేసుకోవచ్చు. దీనికోసం రెండు కప్పుల పెరుగు ని తీసుకొని అందులో కి తురిమిన బీట్ రూట్ ని కలపాలి.. ఇందులోకి కాస్త జీలకర్రపొడి వేయడం వల్ల రుచి గా ఉంటుంది. ఇందులోకి కొన్ని సన్నని ఉల్లిపాయలు తరిగి వేయడం వల్ల బాగా తినవచ్చు.
2). సొరకాయ రైతా  ను వేసవిలో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు.. వీటిని చేయడానికి ఉడకబెట్టిన సొరకాయ ముక్కలను బాగా మెత్తగా చేసుకోవాలి.. ఆ తర్వాత వాటిని పెరుగులో వేసి బాగా కలపాలి. ఇందుకు సరిపడగా పచ్చిమిర్చి, నల్ల ఉప్పు,  జీలకర్ర , కొత్తిమీర ను జోడించాలి.
3). దోసకాయ  రైతా ను ఎలా తయారు చేసుకోవాలంటే. దోస కాయలలో ఎక్కువ మొత్తం నీరు ఉండటం వల్ల ఇది మన శరీరాన్ని చాలా చల్లగా ఉండేలా చేస్తుంది. ఇక అంతే కాకుండా ఇందులో తక్కువ మోతాదులో కేలరీలు ఉంటాయి. ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో కి దోసకాయ తురుము పెరుగు లో కలుపుకుని, అందులోకి కాస్త జీలకర్ర, ఎండుమిర్చి , ఉప్పు వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: