లైఫ్ స్టైల్ : వంటింట్లో మీరు చేసే దోశలు క్రిస్పీ గా, టేస్టీ గా రావాలంటే..?
ఇకపోతే చక్కగా ఇంట్లో దోశలు వేయడం అనేది కొంతమందికి చాలా కష్టమైన విషయం అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే వంట నేర్చుకునేవారి కోసం చక్కటి దోశలు కావాలంటే కొన్ని టిప్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హోటల్ స్టైల్ దోశ కావాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే రుచికరమైన క్రిస్పీ దోస మీరు కూడా తయారు చేయవచ్చు. అయితే మీరు దోశ పిండి కి బియ్యం నాన పెట్టేటప్పుడు.. కొలతల ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా రెండు గ్లాసుల బియ్యానికి.. పావు గ్లాస్ మినప్పప్పు.. పావు గ్లాస్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా నానబెట్టాలి.
ఆ తర్వాత మిక్సీ పట్టే పది నిమిషాల ముందు అటుకులు నానబెట్టి అందులో కలిపేయాలి. అన్నింటిని బాగా వాష్ చేసి తర్వాత మిక్సీ జార్ లో మెత్తగా ఆడించాలి. ఇక ఉదయం దోశ వేస్తామనగా ముందు రోజు అవసరమైనంత పిండి తీసుకొని బయటపెట్టి ఏదైనా ఒక కాటన్ క్లాత్ కప్పి ఉంచాలి. మరుసటిరోజు పులిసిన పిండిలో రుచికి సరిపడా ఉప్పు.. ఆ చిటికెడు సోడా పొడి.. ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ.. అర టేబుల్ స్పూన్ చక్కెర వేసి బాగా కలియబెట్టాలి. పది నిమిషాలు ఆగిన తర్వాత వేడి వేడి పెనం మీద దోశ వేస్తే క్రిస్పీగా టేస్టీగా కరకరలాడే దోసె మీరు కూడా వేసినట్టే.