లైఫ్ స్టైల్: పొడి దగ్గు తో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!!

Divya
పొడి దగ్గు రావడం వల్ల రాత్రి సమయాలలో ఎక్కువగా నిద్ర పోవడం సాధ్యం కాదు.. దగ్గు అనేది ఒక తీవ్రమైన వ్యాధి.. అది కూడా రాత్రిపూట సమయాలలో నిద్రించే సమయంలో వచ్చి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందుచేతనే ఈ దగ్గు తగ్గించుకోవడానికి కొన్ని  హోమ్ రెమిడీస్ ఉన్నవి వాటి గురించి తెలుసుకుందాం.
ముఖ్యంగా పొడి దగ్గు వచ్చినప్పుడు పాలలో కి కాస్త తేనె కలుపుకొని తాగాలి.. ఇలా చేయడం వల్ల దగ్గు సమస్య తగ్గి కాస్త ప్రశాంతం గా నిద్ర పోతారు.
ఇక మరొకటి ఏమిటంటే మన ఇంట్లో దొరికేటువంటి రెండు మిరియాలను బాగా నూరి వాటిని పొడిగా చేసి అందులోకి కాస్త తేనె వేసి కలుపుకొని తింటూ ఉన్నట్లు అయితే కొద్ది రోజులలో దగ్గు సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
ఒక చెంచాడు అల్లం రసం, అందులోకి ఒక టీ స్పూను తేనె కలుపుకొని ఆ రసాన్ని కాస్త గోరువెచ్చని నీరు లో బాగా కలిపి రాత్రి పడుకునే సమయంలో ఈ నీటిని తాగితే దగ్గు వల్ల కలిగే గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్, చికాకు వంటివి పూర్తిగా దూరం అవుతాయి.
పొడి దగ్గు ఉండే వారు ముఖ్యంగా చల్లని నీటిని, చల్లని ఆహారాన్ని తినకపోవడమే మంచిది.. తేనెలోని పదార్థాలు ఈ దగ్గు నుండి విముక్తి అయ్యేలా చేస్తాయి. అందుచేత ని రాత్రి పడుకునే ముందు కాస్త గోరువెచ్చని నీటిలో తేనె వేసుకొని తాగవచ్చు.
ఒక స్పూన్ అల్లం రసం, మరొక స్పూన్ తేనె, మరొక స్పూన్ లైకో రైస్ వంటివి కలుపుకొని రాత్రి నిద్రించే ముందు తినడం వల్ల ఇందులో ఉండే ఔషధ గుణాలు గొంతునొప్పిని, పొడి దగ్గును దూరం చేస్తాయి. ఇక అంతే కాకుండా ఇవన్నీ కలిసి మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని చాలా బలంగా ఉండేలా చేస్తాయి.
ఇవన్నీ మన ఇంటి లోని దొరికేటటువంటి హోమ్ రెమెడీస్.కాబట్టి తప్పకుండా ట్రై చెయ్యండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: