మీ ఫెయిల్యూర్‌కు ఇదే కారణమా..? ఐతే ఇది చదవండి..?

మనలో చాలామంది చాలాసార్లు అనేక విషయాల్లో ఫెయిల్ అవుతాం. దాంతో ఆ ప్రయత్నం అక్కడితో ఆపుతాం.. లేదా మరోసారి ప్రయత్నిస్తాం.. మళ్లీ ఫెయిలైతే ఇక అలాంటి ప్రయత్నమే చేయం.. కానీ.. అసలు మనకు ఎదగాలని తపన ఉంటే ఆపడానికి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నిజం.. ఎందుకంటే.. నాకు ఉచిత విద్య లభించడం లేదండీ అని మీరంటే.. అది హెన్రీ ఫోర్డ్ కి కూడా లభించ లేదని తెలుసుకోంది. మీరు జీవితంలో చాలా సార్లు ఓడిపోయానండి అని అంటే.. అబ్రహాం లింకన్ చాలా అపజయాలను చూశాడని తెలుసుకోండి.

మీరు చాలా పేద కుటుంబానికి చెందిన వాడినని అనుకుంటే.. అబ్దుల్ కలాం కూడా బీద కుటుంబం నుండే వచ్చాడని గుర్తు చేసుకోండి.. మీరు చిన్నప్పటినుండి అనారోగ్య వంతుడినని అనుకుంటే.. నటి మర్లీ మాట్లిన్ చిన్నప్పటి నుండి అవకరంతోనే ఉందని తెలుసుకోండి. ఏదైనా ప్రమాదం జరిగి నాధైర్యాన్ని కోల్పోతే.. నాట్య మయూరి సుధా చంద్రన్ కృత్రిమ కాలుతో డాన్సు చేస్తోందని గుర్తు చేసుకోండి. ఒకవేల.. చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు.. అందుకే నేను ఎదగలేనంటే.. ఎ ఆర్ రెహమాన్ తండ్రి కూడా చిన్నప్పుడే పోయారన్న సంగతి మీకు తెలుసా..

లేదు.. కుటుంబ భారం అంతా నా మీదే ఉంది కదా.. అందుకే నేను ఎదగడం లేదనుకుంటుంటే.. లతా మంగేష్కర్ కూడా చిన్నప్పుడే కుటుంబ భారం మోసిందన్న విషయం తెలుసుకోండి. మీరు చాలా పొట్టివారని ఫీలవుతుంటే.. సచిన్ టెండూల్కర్ కూడా పొట్టివాడేనని గుర్తు పెట్టుకోండి. అబ్బే నాకంత తెలివి లేదండీ అంటారా.. థామస్ ఆల్వా ఎడిసన్ కూడా చిన్నప్పుడు మంద బుద్దివాడేనని మీకు తెలుసా.. ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాను కదా.. దానితో ఏం చేస్తానండీ అంటారా.. ధీరూ భాయి అంబానీ కూడా చిన్న ఉద్యోగం తోనే మొదలు పెట్టాడన్న విషయం తెలుసుకోండి.

ఇక ఇప్పటికే మీ వ్యాపారం దివాలా తీసిందా.. మరేం పర్వాలేదు.. పెప్సీ కోలా కూడా రెండు సార్లు దివాలా తీసిందని తెలుసా.. అబ్బే నా వయసు ఐపోయింది కదా ఇక  ఇప్పుడేం చేస్తానని అనుకుంటున్నారా.. కెంటకీ ఫ్రైడ్ చికెన్ హర్లాండ్ శాండర్స్ 60 వ ఏట కె ఎఫ్ సి మొదలు పెట్టి కుబేరడయ్యాడన్న సంగతి మీకు తెలుసా.. అందుకే మీరు ఎదగాలంటే కావాల్సింది సాకులు కాదు.. సంకల్పం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: