ఈ దేశాలకు వీసా అక్కర్లేదు... ఇండియన్ పాస్‌పోర్ట్‌ చాలు !

Vimalatha
మీ తదుపరి సెలవులను ప్లాన్ చేస్తున్నారా, మీ కోసం ఆసక్తికరమైన విషయంతో ముందుకు వచ్చాము. ఈ కథనంలో, మేము భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌ల కోసం వీసా రహిత దేశాల జాబితాను తీసుకు వచ్చాం . ఈ 21 దేశాలకు భారతీయులు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.
ప్రపంచంలోని దాదాపు 130 దేశాలకు వెళ్లాలంటే భారతీయులు వీసా పొందాలి. అయితే, 21 దేశాలు భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు వీసా రహిత ప్రవేశాన్ని అందిస్తున్నాయి. అయితే, కొన్ని దేశాల్లో మీకు ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, మీరు ఎక్కడ ఉంటున్నారనే దానికి సంబంధించిన రుజువు మరియు కనీస తగినంత డబ్బు మాత్రం అవసరం కావచ్చు. భారతీయులకు వీసా లేని దేశాల జాబితా ఇదే.  

మీరు భారతీయ పాస్‌పోర్ట్‌పై ఈ వీసా రహిత దేశాల అందాలను ఆస్వాదించవచ్చు. కానీ, భారతీయులకు వీసా రహిత దేశాలు నిర్దిష్ట కాలానికి మాత్రమే భారతీయులకు ఉచిత వీసాలు అందజేస్తాయని గుర్తుంచుకోండి. మీరు సందర్శించగల దేశాలకు ఉచిత వీసాల చెల్లుబాటును మీరు ఇక్కడ చూడచ్చు. నేపాల్ - నిరవధిక సమయం, భూటాన్ - 6 నెలలు, ఇండోనేషియా - 30 రోజుల వరకు, ఖతార్ - 30 రోజుల వరకు, పాలస్తీనా - 3 నెలల వరకు (మీరు గాజా స్ట్రిప్ ద్వారా ప్రవేశించలేరు), మైక్రోనేషియా - 30 రోజుల వరకు, మాల్దీవులు - 90 రోజులు బార్బడోస్ - 90 రోజుల వరకు, బ్రిటిష్ వర్జిన్ దీవులు - 30 రోజుల వరకు, కుక్ దీవులు - 31 రోజుల వరకు, డొమినికా - 6 నెలల వరకు, ఎల్ సాల్వడార్ - 90 రోజుల వరకు, ఫిజీ - 4 నెలల వరకు, గ్రెనడా - 3 నెలల వరకు, హైతీ - 3 నెలల వరకు, జమైకా - 30 రోజుల వరకు, మకావు - 30 రోజుల వరకు, మోంట్‌సెరాట్ - 30 రోజుల వరకు, నియు - 30 రోజుల వరకు, ఉత్తర సైప్రస్ - 3 నెలల వరకు, పిట్‌కైర్న్ దీవులు - 14 రోజుల వరకు, సెయింట్ కిట్స్ & నెవిస్ - 3 నెలల వరకు , సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్ - 1 నెల వరకు, సెనెగల్ - 90 రోజుల వరకు, సెర్బియా - 30 రోజుల వరకు, స్వాల్‌బార్డ్ - నిరవధిక సమయం, ట్రాన్స్‌నిస్ట్రియా - 45 రోజుల వరకు, ట్రినిడాడ్ మరియు టొబాగో - 90 రోజుల వరకు, ట్యునీషియా - 90 రోజుల వరకు,టర్క్స్ మరియు కైకోస్ దీవులు - 90 రోజుల వరకు, వనాటు - 30 రోజుల వరకు మాత్రమే మీరు అక్కడ వీసా లేకుండా వెళ్లే అవకాశం పొందచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: