లైఫ్ స్టైల్:మన జీవితంలో పాటించవలసిన కొన్ని వాస్తు చిట్కాలు..!

Divya
ప్రస్తుతం వాస్తు శాస్త్రం అనేది మన జీవితంలో ఒక ముఖ్య భాగంగా మారిపోయింది. అందరం జీవితాన్ని సంతోషంగా గడపడం కోసం వాస్తు ని ఎక్కువగా నమ్ముతూ ఉంటాము.. ఈ వాస్తును సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మంచిదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే వారు చెప్పిన కొన్ని చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1). పడకగది:
మనం విశ్రాంతి తీసుకునే గది ఎంతో ప్రశాంతంగా ఉండాలి. అంతే కాకుండా గాలి కూడా బాగా వీచేలా చూసుకోవాలి. అందుచేతనే మన పడక గది ఎక్కువగా ఆగ్నేయంలోనే ఉండేలా చూసుకోవాలి. సూర్యోదయం, సూర్యాస్తమయం, గాలి , వాన ఇలా అన్నింటికీ అనుగుణంగా  వాస్తు నిర్మాణం చేసుకుంటే  శుభ ఫలితాలు కలుగుతాయి. మీ ఇల్లు కనుక ఉత్తరాన ఉన్నట్లయితే హానికర యూ వీ కిరణాలు పడతాయి.. కాబట్టి ఉత్తరాన ఇల్లు లేకుండా నిర్మించుకోవాలి.
2. వాస్తు శాస్త్రం అనేది మూఢనమ్మకం కాదు..
వాస్తు శాస్త్రము మూఢనమ్మకం కాదు ఎందుకంటే.. వాస్తు శాస్త్రం అంటే శాస్త్రీయ అంశాలతో కూడిన సిద్ధాంతం. పూర్వకాలం లో వుండే పెద్దలు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ వాస్తు శాస్త్రాన్ని రూపొందించారు.
3. డబ్బు:
మనిషి తన జీవితంలో సంతోషంగా జీవించాలి అంటే.. డబ్బు అనేది చాలా అవసరం. డబ్బులు లేకుంటే మనిషి ఏ పని చేయలేడు అని అందరికీ తెలిసిందే. అయితే మనకు డబ్బు ఎలా రావాలి..?ఏ విధంగా రావాలి..? అనే అన్ని విషయాలలో కూడా ఈ వాస్తు శాస్త్రం నేర్పిస్తుంది. ముఖ్యంగా శాస్త్రం ప్రకారం నడుచుకుంటే తప్పకుండా డబ్బు లోటు ఉండదు అని ఆర్థికంగా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతామని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ఆర్థిక భద్రత, కుటుంబంలో సంతోషం,కొత్త ఇంటి నిర్మాణం , బిజినెస్ లో అభివృద్ధి , ఉద్యోగం, సంతాన సాఫల్యం, వివాహం చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యాలకు కార్యక్రమాలకు వాస్తు తప్పనిసరి జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర , వాస్తు నిపుణులు చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: