లైఫ్ స్టైల్: టీ పొడి కల్తీది అని ఎలా తెలుసుకోవాలి..?

Divya
సాధారణంగా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో టీ తాగుతూనే ఉంటారు. టీ ఉపయోగం కూడా ఎక్కువ అవుతోంది కాబట్టి వ్యాపారస్తులు కూడా స్వచ్ఛమైన టీ పొడి లో కల్తీ చేస్తున్నారు. ఇక కల్తీ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. తాగే నీటి నుంచి పీల్చేగాలి వరకు ఇలా ప్రతి ఒక్కటి కల్తీనే.. ముఖ్యంగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఇంట్లో వండిన ఆహార పదార్థాలు కూడా ఒకసారి కల్తీ అవుతూ ఉంటాయి. కల్తీ అవ్వడం వల్ల ఆ ప్రభావం మన ఆరోగ్యం మీద పడి అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి.. అయితే మనం తాగే టీ లో కూడా కల్తీ జరుగుతోంది కాబట్టి ఆ కల్తీని ఎలా కనిపెట్టాలో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..

ముందుగా ఒక ఫిల్టర్ పేపర్ తీసుకొని.. ఆ పేపర్ మీద టీ ఆకుల్ని పరవండి.. ఇప్పుడు టీ ఆకుల మీద కొద్దిగా నీళ్లు చల్లి ఫిల్టర్ పేపర్ తడిసేటట్లు చేయాలి. ఇప్పుడు ఆ ఫిల్టర్ పేపర్ ని తీసుకొని ట్యాప్ వాటర్ కింద పూర్తిగా వాష్ చేయండి.. ఇక లైట్ కి ఎదురుగా ఆ ఫిల్టర్ పేపర్ ను పెట్టి ఆ పేపర్ మీద ఏదైనా మరకలు ఉన్నాయో లేదో మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. మీరు అలా ఆ ఫిల్టర్ పేపర్ ను చెక్ చేసేటప్పుడు ఏవైనా మరకలు  కనిపిస్తే ఆ టీ పొడి కచ్చితంగా కల్తీ అయినట్టే.. ఒకవేళ కల్తీ జరిగి ఉండకపోతే ఫిల్టర్ పేపర్ మీద ఎటువంటి మరకలు కూడా మనకు కనిపించవు.
ఫిల్టర్ పేపర్ మీద టీపొడి కల్తీ జరిగినట్లు కనుక అనిపిస్తే బ్లాక్ లేదా బ్రౌన్ కలర్ లో మరకలు కనిపిస్తాయి. అందుకే  మీరు ఏవైనా సరే కొనుగోలు చేసేటప్పుడు తెలిసిన వ్యాపారస్తులు లేదా రైతుల దగ్గర నుండి కొనుగోలు చేయడం మంచిది లేదా మార్కెట్లో ఉత్తమ బ్రాండ్ నుండి కూడా మీరు వస్తువులను కొనుగోలు చేయవచ్చు. సాధ్యమైనంత వరకు రైతుల దగ్గర్నుంచి కూరగాయలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: