లైఫ్ స్టైల్ : బరువు పెరగాలనుకుంటున్నారా..? వీటిని తినండి.

Divya
ఇటీవల కాలంలో చాలా మంది స్థూలకాయంతో ఇబ్బందిపడుతూ, ఆ బరువు తగ్గించుకోవడం కోసం వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేస్తూ , జిమ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇక మరికొంతమంది విషయానికి వస్తే,  ఎన్ని తిన్నా సరే బరువు పెరగకుండా బక్కపలచగా ఉంటారు. ఇక వీరు సరైన దుస్తులు వేసుకోలేక,  నలుగురిలో ధైర్యంగా తిరగలేక మనోస్థైర్యాన్ని కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడుతూ వుంటారు. అంతేకాదు స్నేహితులు ఆటపట్టిస్తూ ఉంటే ఆ బాధ తట్టుకోలేక ఏదో గబగబ తినేయాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఎవరైతే బరువు పెరగాలనుకుంటున్నారో, అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల బరువు పెరగవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖ్యంగా ఇటీవల కాలంలో బరువు తగ్గడం అయితే కష్టం. కానీ బరువు పెరగడం చాలా సులభం. అయితే తీసుకునే తిండిపై కాస్త జాగ్రత్త, శ్రద్ధ పెడితే చాలు. తొందరగా బరువు పెరగడమే కాకుండా చూడ చక్కని శరీరాన్ని పెంచుకోవచ్చు . అయితే హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే ప్రతిరోజూ ఉదయాన్ని నీటిలో నానబెట్టిన బాదం పప్పులను , నాలుగు నుంచి ఐదు వరకు తినడం మంచిద. వీటిని తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందడమే కాకుండా శారీరక అభివృద్ధి కూడా చెందుతుంది.
ఇక కొబ్బరి పాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ఇందులో మినరల్స్, విటమిన్స్ తోపాటు క్యాలరీలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనం తినే భోజనం లో కొబ్బరిపాలను చేర్చుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
కోడి గుడ్డు మంచి పోషకాహారం. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, విటమిన్ డి, విటమిన్ ఏ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటిని ప్రతి రోజూ తినడం వల్ల మీ శరీరంలో మంచి మార్పు కనబడుతుంది.
ఇక వీటితో పాటు ప్రతిరోజు అరటి పండ్లు, బ్రౌన్ రైస్ వంటివి తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అంతే కాదు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: