బేకింగ్ సోడాతో ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం. !

Suma Kallamadi
ఆడవాళ్లు తమ అందాన్ని కాపాడుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చర్మ సంరక్షణ కోసం ముఖానికి ఏవేవో క్రీమ్స్ రాస్తూ ఉంటారు. బయట దొరికే కెమికల్స్ కలిపిన క్రీమ్స్ రాసుకునే బదులు చక్కగా ఇంట్లో దోరికే పదార్ధాలతో మీ చర్మాన్ని కాంతివంతం చేసుకోండి.అదెలా అనుకుంటున్నారా.. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే బయట దోరికే క్రీమ్స్, మేకప్, లోషన్స్ ముఖానికి రాసుకున్న వెంటనే చర్మం నిగనిగలాడుతుంది. కొని ఆ మార్పు శాశ్వతం కాదు. తాత్కాలికం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి.అందుకనే సహజ సిద్ద పదార్ధాలతో పాటించే టిప్స్ అప్పటికప్పుడు ఫలితం చూయించకపోయిన నెమ్మదిగా మీ చర్మంలో మార్పు వస్తుంది.. కానీ క్రమం తప్పకుండా మీరు ఈ టిప్స్ పాటిస్తేనే మీ చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.. మీ ముఖాన్ని కాంతివంతగా మెరిపించడానికి బేకింగ్ సోడాతో కొన్ని టిప్స్ చూద్దాం.. !!

బేకింగ్ సోడాని వంటల్లో మాత్రమే వాడతాం అనుకుంటే పొరపాటు పడినట్లే. దీనిని ఆడవాళ్ళ అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు తెలుసా.  కొంచెం  బేకింగ్ సోడాని నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే  కాంతి వంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.అలాగే మీ చర్మం  కాంతివంతం కోసం మరొక  చిట్కా ఏంటంటే  1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా,అలాగే 2 టేబుల్ స్పూన్లు ఓట్స్(oats) తీసుకుని నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి కాసేపటి తరువాత శుభ్రం చేసుకుంటే సరి.  

మలినాలతో పూడిపొయిన మీ చర్మ రంద్రాలని శుభ్రం చేసి మీ ముఖాన్ని  కాతివంతంగా, మృదువుగా ఉండేలాగా చేస్తుంది. బేకింగ్ సోడాని మీరు స్నానం చేసే తొట్టెలో కాని, నీటిలో కాని వేసి ఒక 30 నిమిషాలు పాటు ఆ తొట్టెలో స్నానం చేస్తే మీ శరీరంలోని చనిపొయిన కణాలు తొలగిపోయి, కొత్త కణాలు వస్తాయి.అలాగే నల్ల మచ్చలు, మొటిమల వల్ల బాదపడేవారికి, కొంచెం బేకింగ్ సోడాని నీటితో కలిపి ముఖానికి పట్టిస్తే మంచి కాంతివంతమైన చర్మంతో పాటు, నల్ల మచ్చలు, మోటిమలు తోలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: