మొక్క జొన్న పిండితో అందాన్ని ఇలా కాపాడుకోవచ్చు..

Satvika
మొక్క జొన్నలు.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. వర్షాకాలంలో విరివిగా లభించే వీటిలో ఎన్నో ఫోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే తేలికగా జీర్ణం అయ్యే ఈ మొక్క జొన్నల తో ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు. స్వీట్ లలో, సూప్ లలో కూడా ఎక్కువగా వాడుతారు. అయితే మొక్క జొన్న పిండి తో కూడా ఎన్నో ప్రత్యేక వంటలను స్నాక్ ఐటెం లలో వాడుతారు. ఎందుకంటే కరకర లాడేందుకు ఈ పిండిని ఎక్కువగా వాడతారు. ఉదాహరణకు పకోడీ, మంచూరియా వంటి జంక్ ఫుడ్స్ లలో వాడతారు.

ఇకపోతే ఈ మొక్క జొన్న పిండితో ఆహారం మాత్రమే ఆరోగ్యం కూడా ఉంది. అంతేకాదు అందాన్ని కూడా మెరుగు పరుచుకోవానికి ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. అదేలానో ఇప్పుడు చూద్దాం..మృతకణాలు పేరుకుపోయి, చర్మం బరకగా మారుతుంది. ఇలా ఉంటే దాని మెరుపు తగ్గుతుంది. దీనికి పరిష్కారంగా మొక్కజొన్న స్క్రబ్‌ని వాడండి. కప్పు మొక్కజొన్న పిండిలో, చెంచా సీసాల్ట్‌, రెండు చెంచాల కోకోపౌడర్‌, పావుకప్పు పాలు తీసుకుని పేస్టులా చేసుకోవాలి. దీన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకుంటే చాలు. చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది..

జుట్టు బలహీనంగా ఉందనో లేదా తరచూ పొడిబారుతుందనో బాధడేవారు మొక్కజొన్నను వాడొచ్చు. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ సి, లైకోపీన్‌ వంటివి జుట్టుని ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తాయి. దీనికోసం మొక్క జొన్న నూనెతో మాడుకు మర్దన చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగించే పాలికల్స్ ఉత్పత్తిని పెంచుతాయి. దాని వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. తక్కువ సమయంలో ముఖచర్మం కళగా కనిపించాలి అనుకుంటే ఈ ప్యాక్‌ భలే పనిచేస్తుంది. రెండు చెంచాల మొక్క జొన్నపిండి, గుడ్డు తెల్లసొన, చెంచా తేనె, కొద్దిగా బొప్పాయి గుజ్జు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోండి. ఇరవై నిమిషాలయ్యాక చేతుల్ని తడుపుతూ మృదువుగా మర్దన చేసుకుని గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి... ఇలా వారానికి రెండు సార్లు రాసుకుంటే తద్వారా మంచి ఫలితం ఉంటుంది. చర్మం మరింత అందంగా తయారు అవుతుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.. మీ అందాన్ని కాపాడుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: