స్ట్రాబెర్రీ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

Satvika
స్ట్రాబెర్రీ.. ఈ పేరు వినగానే అందరికీ నోరు ఊరిపోతుంది.. పుల్లగా ఉండే ఈ పండును తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ ఈ పండ్లను తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు.ఈ స్ట్రాబెర్రీ లో శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు దాగివున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం మరింత ఆరోగ్యంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఈ స్ట్రాబెర్రీ లో దాగి ఉన్న పోషకాలు, వాటి ఉపయోగాలు గురించి తెలుసుకుందాం..

బ్లడ్ షుగర్ క్రమబద్ధీకరణ :

స్ట్రాబెర్రీలో ఉండే గుణం జీర్ణ క్రియలో గ్లూకోజ్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా రక్తం లోని గ్లూకోజ్, ఇన్సులిన్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అంటే స్ట్రాబెర్రీస్ వల్ల టైప్ -2 డయాబెటిస్ రాకుండా ఉంటుంది.

క్యాన్సర్‌పై పోరాడి :

యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్‌గా పనిచేయడంతో కొన్నిరకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. క్యాన్సర్ కారకాలను హరించి వేస్తుంది. కానీ కొందరు దూరంగా ఉండాల్సిందే.. అద్భుతమైన, మంచి పండ్లు అయిన స్ట్రాబెర్రీస్.. అందరిలో మంచి మార్పులు తీసుకువస్తాయని లేదు. కొందరిలో నోటి దురద వచ్చిన ఫీలింగ్, తలనొప్పులు, పెదాలు వాయడం, నాలుక, ముఖం, గొంతులో తేడాలు లాంటి ఎలర్జీలు సమస్యలు రావచ్చు.

గుండెకు మేలు..

గుండెకు సంభందించిన వ్యాధులు ఉన్న వాళ్లు స్ట్రాబెర్రీస్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లెవల్స్ వృద్ధి చేయడం, మంట స్వభావాన్ని తగ్గించడం. ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గడం. బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్ మెరుగుచేయడం. కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో ఈ పండ్లు మంచిగా పని చేస్తాయి. వీటిని ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ లలో , జ్యూస్ లు , ఐస్ క్రీమ్ లలో ఎక్కువగా వాడుతారు.

చూసారుగా పెద్ద జబ్బులను నయం చేసే గుణాలు ఈ పండ్లలో అధికంగా ఉన్నాయి. ఇప్పటి నుంచి స్ట్రాబెర్రీస్ ను ఎక్కువగా తినడం అలవాటు చేసుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: