వీటిని తీసుకోవడం వల్ల మరింత యవ్వనంగా మారతారట?

Satvika
వయసు పెరిగినా కూడా ఎప్పటికీ యంగ్ గా కనిపించడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు.. అయితే కెమికల్ సంబంధిత ప్రొడక్టులను వాడి ఉన్న అందాన్ని కూడా పోగొట్టుకుంటారు.. అయితే ఇంట్లో దొరికే వాటితో నిత్య యవ్వనం గా ఉండవచ్చు అని నిపుణులు అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

నిమ్మకాయ
నిమ్మ కాయలో ఉండే విటమిన్-సి, యాంటీ-ఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదపడతాయి.
అల్లం
అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు వ్యాయామం తర్వాత వచ్చే కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

దానిమ్మ
దానిమ్మ చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటమే కాక.. చర్మం ఎండ దెబ్బతినకుండా కాపాడుతుంది.
పసుపు
పసుపు చిటికెడు రోజు తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అందానికీ, ఆరోగ్యానికీ ఈ పసుపు దివ్య ఔషదం గా పని చేస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి..

ఎర్ర ద్రాక్ష
ఈ ఎర్ర ద్రాక్ష లో చర్మానికి సహజ రంగును కలిగించడంలో చక్కగా ఉపయోగపడుతుంది.. ఇకపోతే  చర్మం పై ముడుతలు రాకుండా కాపాడుతుంది.. ఇకపోతే రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థం ఉంటుంది, ఇది మంచి చర్మ రూపాన్ని కాంతివంతంగా మార్చేందుకు సహాయపడుతుంది...

చికెన్ సూప్
చికెన్ వారానికి రెండు మూడు సార్లు తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.. శరీరంలో వేడిని పెంచుతుంది.. దీంతో శరీరంలో అధిక కొవ్వును కూడా పూర్తిగా తొలగిస్తుంది . ఇంకా నొప్పి, మంట లాంటివి రాకుండా కాపాడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి..
వీటితో పాటుగా జామ, ఓట్స్, గ్రీన్ టీ, కొత్తిమీర, చెర్రీ జ్యూస్, యాపిల్, స్వీట్ పొటాటో మొదలగు పదార్థాలు కూడా అందాన్ని మరింత మెరుగు పరచడానికి దోహద పడతాయి..
ఇవే కాకుండా మరెన్నో ఆహార పదార్థాలు ఉన్నాయట.. అవేంటో కూడా ఒకసారి చూడండి..
ప్లాక్స్ సీడ్స్, పీనట్ బటర్, వాల్ నట్స్, ఉల్లిపాయలు, వెన్న, చాకొలేట్ మిల్క్, టమాటాలు మొదలగు పదార్థాలు కూడా యవ్వనంగా ఉంచడానికి దోహద పడతాయి.. చూసారుగా మన ఇంట్లో ఎప్పుడూ చూసే వాటిని అందాన్ని ఎలా మెరుగు పరుచుకోవచ్చునో...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: