నోరూరించే అంజీర్ బర్ఫీను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Satvika
అంజీర అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. పులుపు ,తీపి ఉన్న ఈ కాయలో శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు దాగివున్నాయి. వీటిని అలాగే పచ్చిగా తీసుకున్నా ..లేక డ్రై ఫ్రూట్ లా తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది..అయితే ఈ అంజీరను అలానే తీసుకోవడానికి కొంతమంది ఇష్టపడక పోవచ్చు.. కానీ వంటలలో వాడుకోవడం ద్వారా తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో ఐరెన్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ,మరియు విటమిన్లు అధికంగా ఉంటాయి. దీంతో డాక్టర్లు కూడా వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. కొంత మంది అలానే తినడానికి ఇష్టపడని వాళ్ళు వెరైటీ గా వంటలను చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
 గతంలో వీటిని సలాడ్ లో , ఐస్ క్రీం లలో వాడుతుంటారు. కానీ ఇప్పుడు కేక్ లలోనూ అలాగే బిస్కెట్స్ లలో కూడా వాడుతున్నారు. కాగా, ఇప్పుడు ఈ అంజీరా తో క్రిస్టమస్ స్పెషల్ కేకును ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాము...



కావలసినవి పదార్థాలు..


ఎండు అంజీర్‌ ముక్కలు: ముప్పావుకప్పు, 

ఖర్జూర ముద్ద: అరకప్పు

కిస్‌మిస్‌: పావుకప్పు, 

బాదం, జీడిపప్పు,

 పిస్తా: అన్నీ కలిపి ముప్పావుకప్పు,
 
యాలకులపొడి: అరచెంచా,

 దాల్చినచెక్కపొడి: చిటికెడు,

నెయ్యి: చెంచా.


తయారీ విధానం:


ముందుగా స్టౌ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి.. అందులో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, పిస్తా పలుకుల్ని దోరగా వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో అంజీర్‌ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తగా అయ్యేవరకూ వేయించుకోవాలి. అవి కాస్త మెత్తగా అవుతున్నప్పుడు మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ బాగా కలుపుకోవాలి.. మొత్తం మెత్తగా అయ్యేవరకు అడుగు అంట కుండా కలుపుకోవాలి..అయిదు నిమిషాలుఅయ్యాక దింపేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యిరాసిన పళ్లెంలో పరిచి... చల్లగా అయ్యాక ముక్కల్లా కోయాలి.. అంతే క్రిస్టమస్ కోసం రుచికరమైన అంజీర్ బర్ఫీను ఇంట్లోనే తయారు చేసుకొని ఇంటిల్లి పాది హాయిగా తినవచ్చు.. ఈ వెరైటీ డిష్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: