ఇలా చేస్తే మీ చర్మం సాఫ్టు గా తయారవుతుంది..

Satvika
ప్రస్తుతం చలికాలం మొదలైంది.. మనము ఎంత జాగ్రత్తగా ఉండాలని అనుకున్నా కూడా చర్మం పగుళ్లు ఏర్పడుతుంది.. అయితే ఎంతగా రెడీ అవ్వాలని అనుకున్నా కూడా చర్మం అందుకు సహకరించదు.. ఎన్ని క్రీములు వాడిన కూడా అలానే ఉంటుంది. చలికాలం కాబట్టి వేడి వేడి వస్తువులను తినడం, తాగడం, వేడి నీళ్ళతో కడగటం చేస్తాము దాంతో చర్మం ఇంకా గరుకుగా మారుతుంది.. అందవిహీనంగా తయారవుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలని అంటున్నారు నిపుణులు.. అవేంటో ఇప్పుడు చూద్దాం... ఇంట్లో ఉండే వాటిని వాడి అందంగా ఎలా తయారు అవుతారో చూద్దాం..

పెట్రోలియం జెల్లీ

కొన్ని స్టడీస్ ప్రకారం పెట్రోలియం జెల్లీ పెద్ద వారిలో స్కిన్‌ని హీల్ చేయగలదు. పెట్రోలియం జెల్లీనే మినరల్ ఆయిల్ అని కూడా అంటారు. ఇది స్కిన్ మీద ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. ఇందు వల్ల తేమ లోపలే ఉండిపోతుంది. ఫలితంగా డ్రై పాచెస్ హీల్ అవుతాయి.

గోరు వెచ్చని నీరు

వేడి నీటితో స్నానం ఎంత హాయిగా ఉన్నా స్కిన్ కి అది మంచిది కాదు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుంది. అలాగే మాయిశ్చరైజ్ చేసి, స్కిన్‌ని రిపెయిర్ చేస్తాయని చెప్పే సోప్స్ పడకపోతే ఆపోజిట్ ఎఫెక్ట్ ఉండవచ్చు. అలాగే, హార్ష్ కెమికల్స్ లేకుండా, ఫ్రాగ్రెన్స్ లేకుండా, స్కిన్ మీద మృదువుగా ఉండే సబ్బులను ఎంచుకోవాలి..

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది.. రాత్రి పడుకోబోయే ముందు చేతులకు కాళ్ళకు రాసుకొని పడుకుంటే పగల కుండా ఉంటాయి..

ఇవే కాకుండా ఒట్ మీల్ బాత్, అలాగే బట్టలు, గ్లోవ్స్ వీటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి.. కొన్ని ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యని నివారించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న బ్లూ బెర్రీలు, టమాటాలు, క్యారెట్లు, బీన్స్, బఠానీలు, పప్పులు వంటివి తీసుకోవడం మేలు చేస్తుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న సాల్మన్ వంటి ఫిష్ కూడా తీసుకోవచ్చు.అలా చేయడం వల్ల చలికాలం నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: