చలికాలంలో చర్మాన్ని మరింత అందంగా మార్చుకోవాలంటే ఇలా చేయాలి..

Satvika
చలికాలం వచ్చిందంటే ఎంత అందంగా ఉన్న చర్మం అయిన సరే అందవిహీనంగా మారుతుంది.అయితే ఎప్పటి లాగా చర్మం అందంగా ఉండాలని అమ్మాయిలు తెగ ప్రయత్నిస్తున్నారు.. అందుకోసం ఏదేదో చేస్తుంటారు.. కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో చేసేదేమీ లేక చలికాలం పోయె వరకు ఆగుతారు. మరి కొందరు ఇంట్లో దొరికే వాటితో ఏదోక ప్రయోగం చేస్తుంటారు. ఇలా చర్మం పొడి బారకుండ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
చలి కాలం కదా అని వేడి నీళ్లతో స్నానం చేస్తే ఇక చర్మం మృదువు అనే మాట పక్కన పెడితే అంతో ఇంతో ఉన్న చర్మం పొడి వారి పోతుంది. అందుకే చలికాలంలో కూడా కొద్దిగా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని చెప్తుంటారు..
ఏ కాలంలో అయిన నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం ,తేమని కోల్పోకుండా ఉంటుంది.. సమ్మర్ లో స్కిన్ కి సరిపోయే ప్రోడక్ట్స్ వింటర్ లో సరిపడవు. వింటర్ లో స్కిన్ హెల్దీగా గ్లోయీ గా ఉండాలంటే ఒకటే మార్గం, మైల్డ్ ప్రోడక్ట్స్ ని ఎంచుకోవడం. మాయిశ్చరైజర్స్ ఉన్న క్లెన్సర్స్ ని ఎంచుకోండి. గ్రీజు లేదా ఆల్కహాలు వంటి గాఢమైన పదార్థాలు ఉన్న వాటిని పూర్తిగా దూరం పెట్టడం మేలని నిపుణులు అంటున్నారు.
శరీరం లో మిగిలిన భాగాల కంటే చేతుల మీద ఆయిల్ గ్లాండ్స్ తక్కువగా ఉంటాయి. అందుకనే, చేతుల ద్వారా మాయిశ్చర్ ఎస్కేప్ అయిపోతుంది. అందుకనే, బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్స్ కి కూడా తప్పని సరిగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
చలికాలం లో దొరికే కాయలు, పండ్లును తీసుకోవడం శరీరానికి చాలా మంచిదని అంటున్నారు..వాటితో పాటుగా వింటర్ లో గోరు వెచ్చని పాలు తాగడం మంచిది.
పొద్దున్నే బయటకు వెళ్ళే వాళ్ళు సన్ స్క్రీన్ రాసుకున్నట్లు , సన్ గ్లాసెస్ కూడా వాడటం ఉత్తమం..
చర్మం పొడి బారకుండా ఉండాలంటే రాత్రి పడుకోయే ముందు చర్మానికి శీతల లేపనాలు వాడాలని అంటున్నారు.. అలా చేయడం వల్ల ఉదయం లేచినప్పుడు వచ్చే చలికి చర్మం తట్టుకుంటుంది..
చూసారుగా పైన తెలిపిన వాటిని వాడటం వల్ల చర్మానికి మంచి ఫలితం ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: