ఈ రోజే గ్ర‌హ‌ణం.. అలాంటివారు ఈ ఆహారం అస్స‌లు తీసుకోకండి..!!

Kavya Nekkanti

2020 సంవ‌త్స‌రంలో మొదటి సూర్యగ్రహణం జూన్ 21 న(నేడు) రానున్న సంగ‌తి తెలిసిందే. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణము ఏర్పడుతుంది. ఈ సూర్య గ్రహణము అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణాలు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే గ్రహాల స్థితిగతుల ఆధారంగా భూత, భవిష్యత్ వర్తమాన కాలాలను అంచనా వేస్తుంటారు పండితులు. 

 

అందులోనూ గ్రహణం రోజు వీటి ప్రభావం మనుషులపై ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ గ‌ర్భ‌వ‌తులు అయితే గ్ర‌హ‌ణంరోజు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. గర్భవతులు ఈ సమయంలో పదునైన వస్తువులు పట్టుకోవద్దని, స్నానం చేయకూడదని, అలా చేస్తే పుట్టే బిడ్డ లోపాలతో పుడతాడని అంటారు. అలాగే పెద్ద‌ల న‌మ్మ‌కాల ప్ర‌కారం గ‌ర్భ‌వ‌తులు ఆ సమయం లో వండిన ఆహారం తినకూడదు. అరటిపండు, యాపిల్, దానిమ్మ వంటివి హాయిగా తినచ్చు కాని, వండినవి కాకుండా పండ్లు, రసాలు తీసుకోకూడ‌దు.

 

ఎందుకంటే.. ఈ సమయం లో వాతావరణం లో జరిగే అనేక మార్పుల వల్ల వండిన ఆహారంలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ సమయం లో ప్రెగ్నెంట్స్ నాన్-వెజ్ ఫుడ్ తీసుకుంటే కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఇక గ్రహణ సమయంలో ఆకలిగా నీరసంగా అనిపిస్తే తేలిగ్గా జీర్ణమయ్యే పండ్లు తీసుకోవచ్చు. అవి తినేటప్పుడు కూడా తులసి ఆకులతో కలిపి తీసుకుంటే ఎలాంటి దోషం ఉండదని అంటున్నారు. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. సూర్య గ్రహణ సమయంలో నీరసం రాకుండా ఉండటానికి గర్భవతులు నీరు ఎక్కువగా తాగాలి. లేదా కడుపులో ఉన్న బిడ్డకి హాని జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఎక్కువగా నీరు తీసుకోండి. నీటిని తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండ‌వు.


 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: