“దేశ ముదురు” సినిమా తెచ్చిన తంటా...సన్యాసినిలుగా....

NCR

సినిమాలు వినోదం కోసం మాత్రమే ఉన్నాయనే విషయాన్ని పిల్లలకి తల్లి తండ్రులు చెప్పాలి. సినిమాలు మంచిని చెప్పడం చాలా అరుదుగా కన్పిస్తుంది, విచ్చలవిడి స్వేఛ్చకి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయనే అసలు పరమార్ధాన్ని సినిమాలు చూపించే  సమయంలో ప్రతీ ఒక్క తల్లీ తండ్రి పిల్లలకి చూపించే చెప్పాలి. లేదంటే ఆ యువ హృదయాలు సినిమాలో హీరో హీరోయిన్స్ క్యారక్టర్స్ ని తమకి అన్వయించుకుని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

 

చిత్తూరు జిల్లా, పలమనేరు కి చెందిన విశ్వనాద్ అనే వ్యక్తికి ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు. తిరుపతిలో ఓ ప్రవైటు కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. పండగకి ఇంటికి వచ్చిన పిల్లలపై తల్లి ఏదో  కోపంలో మందలించింది. దాంతో మాట్లాడకుండా ఇంట్లోని ఉన్న వారిని తండ్రి  తమిళనాడు లోని భందువుల ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో ఉండండి ఇప్పుడే వస్తాను అని బయటకి తండ్రి వెళ్ళగానే ఇదే అదును అనుకుని భావించిన ఆ ఇద్దరు అక్కా చెల్లిళ్ళు...

 

రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడి నుంచీ కర్నూల్ వైపు వెళ్ళారు. తండ్రి భందువుల ఇంటికి వెళ్లి చూడగా పిల్లలు కనపడక పోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పిల్ల వద్ద ఉన్న సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఆవడంతో పోలీసులు సెల్ ఫోన్ నెంబర్ ని ట్రేస్ లో పెట్టారు. కొన్ని గంటల తరువాత సెల్ ఫోన్ స్విచ్ ఆన్ చేయడంతో టవర్ లోకేష్ కర్నూల్ లోని ఎమ్మిగనూరు ప్రాంతంలో ఉందని పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వారిని పట్టుకుని తల్లి తండ్రులకి అప్పగించారు. వారిని పోలీసులు విచారించగా తల్లి మీద కోపంతో ఉండగా స్నేహితురాలు సలహాపై దేశ ముదురు సినిమా హీరోయిన్ లా మేము ఇద్దరం సన్యాసంలో కలినిపోవాలని అనుకున్నామని చెప్పడంతో తల్లి తండ్రులు, పోలీసులు కూడా షాక్ తిన్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: