వావ్, సూర్యగ్రహణ సమయంలో నిలబడుతున్న గుడ్లు.. ఈ ప్రయోగం వైరల్..!!

Yelleswar Rao

సూర్యగ్రహణం సమయంలో గుడ్డు నిటారుగా నిలబడగలదా? దానికి సమాధానం అవుననే చెప్పాలి. ఎందుకంటే.. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుందని, అప్పుడు గుడ్లని నేల ఉపితలంపై నిటారుగా ఉంచితే అవి పడిపోకుండా అలానే ఉంటాయని ఒక శాస్త్రీయ సిద్ధాంతం చెబుతుంది. కానీ ఈ సిద్ధాంతం వర్క్ అవుట్ అవుతుందో లేదో శాస్త్రవేత్తలు రుజువు చూపలేదు. 

https://mobile.twitter.com/redjfluff/status/1210078321251213313

 

ఆ సిద్ధాంతం నిజం చెబుతుందని ఏ నిరూపణ లేనప్పటికీ మలేషియా, ఇండోనేషియా ప్రజలు ఈ రోజు సూర్యగ్రహణం సందర్భంగా ఒకసారి ప్రయత్నం చేస్తే ఏం పోతుందని అనుకున్నారు. ఆపై గుడ్లను నేలపై ఉంచి నిజంగానే అవి పడిపోకుండా ఉంటాయా లేదా అని పరీక్షించించారు. ఆశ్చర్యం కలిగించే రీతిలో అవి పడిపోకుండా అలానే నిటారుగా నిలబడ్డాయి. దీంతో, ఈ అరుదైన ప్రయోగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు ఆ దేశీయులు. ప్రస్తుతం వీరు చేసిన ఈ ప్రయోగం ఆసియా ఖండం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. 

https://mobile.twitter.com/syedaFatimahuda/status/1210122002864001024

ఆ తరువాత మరికొంత మంది 'రింగ్-ఆఫ్-ఫైర్' గ్రహణం సమయంలో కంకర, విండో పేన్, ఒక ప్లేట్‌తో సహా వివిధ ఉపరితలాలపై గుడ్లు పెట్టి వాటిని నిటారుగా నిల్పడంలో సఫలం అయ్యారు. 

 

అయితే, మలేషియా సైన్స్ విశ్వవిద్యాలయం నుండి రిటైర్డ్ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ చోంగ్ హోన్ యూ మాట్లాడుతూ, ఈ సిద్ధాంతానికి ఎటువంటి రుజువు లేదు. "మీరు రేపు, గ్రహణానికి ముందు లేదా తరువాత అదే ప్రయోగం చేసి గుడ్లను నిలబెట్టవచ్చు - దీన్ని చేయడం చాలా సులభం. కాని ఇలా చేయడం వలన చిన్నపిల్లలకి సైన్స్, ఖగోళశాస్త్రం పట్ల ఆసక్తిని కలిగించవచ్చు." అని చోంగ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: