బట్ట తలపై జుట్టు తెప్పించే టోపీ..క్లినికల్ అనుమతులే తరువాయి..!!!

NCR

బట్ట తల ఉందని బెంగ పెట్టుకుని డిప్రెషన్ కి గురయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారి తలపై జుట్టు మోలిచేందుకు చేయని ప్రయత్నాలు లేవు. అన్ని రకాలుగా వాళ్ళు అనేక లోషన్లు, హెయిర్ ఆయిల్స్ వాడుతూ జుట్టు రావడంకోసం విశ్వప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే జుట్టు రావడం అనేది అసాధ్యం అవుతోంది. బట్టలపై జుట్టు రావడానికి హెయిర్ ప్లాంటేషన్ వంటి అధునాతన పద్దతులు వచ్చినా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడంలేదు.

 

ఈ క్రమంలోనే బట్టతలపై జుట్టు వచ్చేలా కొంతమంది శాస్త్రవేత్తలు కొత్తరకం పద్దతిలో ప్యాచ్ ని కనుగొన్నారు. ఈ పద్దతిలో జుట్టు రావడంతో తమ పరిశోధనలని మరింత వేగంవంతం చేసి సక్సెస్ అయ్యారు. అసలు తలపై చుండ్రు పేరుకుపోవడం వలెనే జుట్టు ఊడిపోయి, కోరుకుడిగా ఏర్పడి బట్టతలగా మారుతుంది.అసలు చుండ్రు ని కంట్రోల్ చేసి జుట్టు తెప్పించడం కోసం విస్కాన్సిస్ మాడిసన్ యూనివర్సిటీ లో కొందరు పరిశోధకులు చుండ్రుని కంట్రోల్ చేసి జుట్టు మొలిచేలా ప్యాచ్ తయారు చేశారు.

 

ముందుగా వారు జుట్టు లేని ఎలుక , చుంచులపై ఈ ప్రయోగం చేయగా వాటికి కొన్ని రోజల తర్వాత జుట్టు రావడం గమనించారు. ఈ క్రమంలోనే ఆ పరిశోధకుల్లో ఒకరు తన తండ్రికి ఉన్న బట్టతలపై ప్యాచ్ ఉన్న క్యాప్ ని పెట్టి రెండు నెలలు పరిశీలించారు.  ఊహించని విధంగా జుట్టు రావడంతో ఒక్క సారిగా అందరూ షాక్ అయ్యారు. తమ పరిశోధన ఫలించిందని సంతోష పడ్డారు. ఇది అందరికి ఉపయోగ పడేలా క్లినికల్ ట్రయిల్ కి పర్మిషన్ ఇవ్వాలని అభ్యర్ధన పెట్టుకున్నారు. అయితే దీర్ఘకాలికంగా బట్ట తల ఉన్న వారికి ఇది ఉపయోగపడదని 5 ఏళ్ళ ముందు వరకూ జుట్టు ఊదిపోతున్న వారికి ఇది ఎంతో అద్భుతంగా పని చేస్తుందని తెలిపారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: