బ్యాడ్ కొలెస్ట్రాల్ చెక్‌కు ఈజీ టిప్స్‌

Kavya Nekkanti
బాడీలో ప్రతి ఒక్కరికీ కొలెస్ట్రాల్ ఉంటుంది. అది మోతాదులో ఉంటే ఏమీ కాదు. కానీ ఆ కొవ్వు పెరిగితేనే చాలా ఇబ్బంది. ఇక బాడీలో అంతా మంచి కొలెస్ట్రాల్ ఉండదు. చాలా మందికి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అది ఎంత ఎక్కువ పెరిగితే అన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది.


రక్తనాళాల్లో కొందరికి కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ రిలేటెడ్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. మామాలు కొవ్వు ఉంటే అంత ప్రమాదం లేదుగానీ చెడు కొవ్వు ఉన్న ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతుంటారు.  వీలైనంత వరకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ఓ సారి ఇటు లుక్కేయండి..


- మెంతుల ద్వారా  ఈజీగా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. రోజూ ఉదయాన్నే మెంతులతో తయారు చేసిన కషాయాన్ని తాగితే త్వరగా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.


- రోజూ ఉసిరి తినడం వల్ల కూడా మీ బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోతుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో ఉండే కొవ్వు మొత్తం కూడా కరిగిపోవడానికి ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయమే ఉసిరికాయ తినడమో లేదంటే ఉసిరి జ్యూస్‌ తాగడమో చేయండి.


- రోజూ యాపిల్ తీసుకోవడం వల్ల కూడా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. అందువల్ల రోజూ ఒక యాపిల్ తినేలా ప్లాన్ చేసుకోండి.


- బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే రోజూ మీరు తినే ఆహారంలో ధనియాలు ఉండేలా చూసుకోండి. ధనియాలతో కషాయం తయారు చేసుకుని తాగుతూ ఉంటే చాలు ఈజీగా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.


- రోజూ గ్రీన్ టీ తాగితే కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులు కూడా రావు.


- జామ పండ్లను రోజూ తింటే చాలా మంచిది. వాటిలో ఉండే ప్రత్యేక గుణాలు కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించగలవు.


- ద్రాక్షలో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రోజూ ద్రాక్షను తీసుకుంటే బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోతుంది.


- ఓట్స్ తో తయారు చేసిన పదార్థాలను రోజూ తింటూ ఉండండి. దీని వల్ల బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. సబ్జా గింజల్ని తింటే కూడా చెడు కొలెస్ట్రాల్ అనేది ఉండదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: