పిల్లలలో ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్టే..!!

N.ANJI
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఈ మహమ్మారి కారణంగా స్కూల్స్ మూతపడ్డాయి. దీంతో పిల్లల చదువు విషయంలో కొత్త సమస్య వచ్చి పడింది. ఈ సమస్య ఇప్పుడు పిల్లల చదువు, ఆటలు అన్ని స్మార్ట్ ఫోన్ తోనే సాగుతున్నాయి. ఇక బయట తిరిగే పరిస్థితి లేక పోవడంతో.. వారికీ స్మార్ట్ ఫోన్ ఓ వ్యసనంలా మారింది. దీనిని ఓ రకంగా వ్యసనం అనేకంటే మానసిక ఆనారోగ్యం అనే చెప్పాలి. దీనిని గురించి పిల్లల వైద్యులు ఏం చెబుతున్నారో ఒక్కసారి చూద్దామా.
సాధారణంగా మానసిక రోగం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో అందరికి తెలిసే ఉంటుంది. ఇక పిల్లలు లేదా పెద్దలు అందరూ ఇదే సమస్యతో బాధపడుతున్నారని చెప్పుకొస్తున్నారు. అయితే చాలా మందికి ఆటిజం గురించి తెలిసి ఉండవచ్చును. ఇక ఇప్పుడు పిల్లలు కూడా వర్చువల్ ఆటిజం సమస్యలను ఇలా గుర్తించవచ్చు.
అయితే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, నరాల వాపుతో కూడిన నాడీ సంబంధిత అభివృద్ధి రుగ్మత. మనం సామాజికంగా ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఇది తరచుగా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాక.. వారి ప్రవర్తనలో చాలా అడ్డంకులు ఉన్నప్పుడు ఇది తరచుగా కనిపిస్తుందని తెలిపారు. అయితే ఈ రుగ్మత వంశపారంపర్యంగా 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో సర్వసాధారణం అని అంటున్నారు.
ఇక ఇటీవల విడుదల చేసిన కొత్త వేరియంట్‌లో కూడా ఇలాంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. ఇక దీనినే వర్చువల్ ఆటిజం అని కూడా అంటుంటారు. అయితే వర్చువల్ ఆటిజం ప్రధానంగా 4 , 5 సంవత్సరాల మధ్య పిల్లలలో కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇక ఇది తరచుగా మొబైల్ ఫోన్‌లు, PCలు లేదా కంప్యూటర్‌ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లకు బానిస కావడం వల్ల వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా.. స్మార్ట్‌ఫోన్‌ల మితిమీరిన వినియోగం, ల్యాప్‌టాప్‌లు, టీవీలలో చిత్రాలను ఎక్కువగా చూడటం వంటి సమస్యలు సమాజంలోని ఇతరులతో మాట్లాడటం, కమ్యూనికేట్ చేయడం పిల్లలకు కష్టతరం చేస్తాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: