చిన్న పిల్లల ఏడుపును కంట్రోల్ చేసే దివ్యౌషధం.. ఏమిటంటే..?

Divya
చిన్న పిల్లలు మాటలు రాని వయసులో తాము ఏమనుకుంటున్నారో చెప్ప లేరు కాబట్టి.. ఏడుపు రూపంలో.. ఆకలి వేసినా.. నిద్ర వస్తున్నా .. కాస్త ఇబ్బంది కరంగా అనిపించినా.. చల్లగా ఉన్నా.. వేడిగా అనిపించినా.. ఇలా ఏడుపు రూపంలో తమ భావాలను వ్యక్త పరుస్తూ ఉంటారు. ఆ చిన్న పిల్లలు ఎందుకు ఎలాంటి కారణాల వల్ల ఏడుస్తున్నారు అనే విషయాన్ని కేవలం తల్లులు మాత్రమే కనిపెట్టగలరు అని నిపుణులు చెబుతున్నారు.. కానీ ఒక్కో సమయంలో ఇది నిజంగా వాళ్లకు అతి కష్టతరమైన టాస్క్ గా అనిపించవచ్చు. అంతే కాదు వారు ఎందుకు ఏడుస్తున్నారో కూడా తెలుసుకోవడం అంత ఈజీ ఏం కాదు అని మరి కొంతమంది తల్లులు చెబుతున్నారు.
వారికి నచ్చింది ఇచ్చినా లేదా ఏం చేసినా సరే ఆ పిల్లలు గుక్క పెట్టి మరీ ఏడుస్తూ ఉంటారు.. అంతేకాదు ఇలా ఎక్కువగా ఏడవడం వల్ల పిల్లలకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.. ఈ సమయంలో తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ వైద్యులను సంప్రదించిన రోజులు కూడా కొంత మంది తల్లిదండ్రులకు ఎదురవుతూ ఉంటాయి. అయితే చిన్న పిల్లలు ఏడవకుండా ఉండాలి అంటే హోమియోపతిలో చక్కని పరిష్కారం ఉంది.. ఈ మందుల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోగా ఎన్నో రకాల ఎలర్జీలను కూడా తగ్గించడానికి సహాయపడుతాయి.
హోమియోపతి నిపుణులు ఏం చెబుతున్నారు అంటే పిల్లలు ఎక్కువగా ఏడ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి చమోలియా  అనే ఒక హోమియోపతి మందు మాత్రమే పిల్లల ఏడుపును కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందట. పిల్లలకు జ్వరం వచ్చినా.. నొప్పి కలిగినా లేదా అప్పుడప్పుడే పన్ను వస్తున్న సమయంలో, డయేరియా వంటి సమస్యలు తగ్గించడానికి కూడా డాక్టర్లు సైతం ఈ మందులు ఇస్తున్నారు. అంతే కాదు పిల్లలకు వచ్చే చెవి నొప్పి, చర్మంపై ఎర్రటి దద్దుర్లు, మోషన్ వెళ్లినప్పుడు దుర్వాసన వంటి సమస్యలకు కూడా ఈ మందును ఉపయోగించడం గమనార్హం. కాబట్టి తల్లులు మీ చిన్న పిల్లలు ఏడుస్తున్నట్లు అయితే ఒకసారి వైద్యులను సంప్రదించి ఈ మందులను ఉపయోగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: