పినాకిల్ బ్లూమ్స్ : అందరికీ అమ్మ.. కోటి చిరునవ్వులకు చిరునామా?

praveen
నేను బాగుంటే చాలు పక్క వాళ్ళు ఎటు పోతే నాకేంటి.. ఏం బాధపడితే నాకేంటి.. ప్రస్తుతం అందరి ఆలోచన తీరు ఇలాగే ఉంది.. పక్కవాడు సమస్యలతో సతమతమవుతూ ఉంటే చూసి నవ్వుకోవడం తప్ప అయ్యో పాపం అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి.. ఇలా మనిషి ఆలోచనా తీరు నేను, నాది అని ముందుకు సాగుతుంటే.. ఇక్కడ ఒక  మాతృమూర్తి చేసిన ఆలోచన మాత్రం అందరికీ ఆదర్శంగా మారిపోయింది. పిల్లల ఎదుగుదల విషయంలో బాధపడుతున్న ఎంతోమంది తల్లిదండ్రుల్లో కొత్త ఊపిరి పోసింది.

 ఆటిజం సమస్యతో బాధపడుతున్న పిల్లలను చూసి ఇక తమ పిల్లల భవిష్యత్తు ముగిసిపోయింది అని అనుకుంటున్న ఎంతోమంది పేద మధ్య తరగతి పిల్లల తల్లిదండ్రులకు ఆమె ఆలోచన ఒక భరోసా ఇచ్చింది. కొడుకు కోసం ఆమె పడిన బాధ ఇంకె మాతృమూర్తి పడకూడదు అని  ఆ మహిళామణి చేసిన చిన్న ప్రయత్నం.. ఎంతోమంది ముఖాల్లో చిరునవ్వులు నింపింది. డాక్టర్ శ్రీజ రెడ్డి సరిపల్లి కుమారుడు ఆటిజం అనే సమస్యతో బాధ పడ్డాడు. ఈ క్రమంలోనే సమస్య నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుని బయట పడేలా చేయడానికి తిరగని హాస్పిటల్ లేదు చేయని ప్రయత్నం లేదు.

 ఇక ఆ తర్వాతే ఆమె మనసులో ఒక గొప్ప ఆలోచన మెదిలింది.. తన లాగ ఏ తల్లి బాధపడకూడదు అనుకుంది.. ఈ క్రమంలోనే పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థను స్థాపించింది. ఈమె స్థాపించిన ఈ సంస్థ సంపన్నుల కోసం కాదు.. పిల్లల భవిష్యత్తు ఏంటోతెలియక అయోమయంలో పడి పోయిన పేద మధ్యతరగతి తల్లిదండ్రుల కోసమే. ఇక ఇలా ఫినాకిల్ బ్లూమ్స్ ద్వారా వినికిడి లోపం, మానసిక లోపం లాంటి సమస్యలతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులకు వైద్యం అందిస్తూ.. సొంత తల్లి లాగానే అందరినీ చేరదీస్తూ అందరికీ అమ్మ గా మారిపోయింది శ్రీజ రెడ్డి సరిపల్లి.

ఎంతోమంది తల్లిదండ్రుల బాధలు పోగొట్టే చిన్నారులను ఆటిజం సమస్య నుండి బయట పడేలా చేయాలి  అన్న ఆమె ఆలోచన గొప్పది.. అంతకంటే ఆమె సంకల్పం ఎంతో గొప్పది.. అందుకే ప్రస్తుతం పినాకిల్ బ్లూమ్స్ సంస్థ ద్వారా ఎంతో మంది చిన్నారులకు వైద్యం అందిస్తుంది. ఇలా ఆటిజం సంస్థ తో బాధపడుతున్న ఎంతో మందిని సాధారణ స్థితికి తీసుకువస్తుంది. డాక్టర్ శ్రీజ రెడ్డి సరిపల్లి స్థాపించిన పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థనే మరో బిడ్డ గా భావించి భర్త కోటిరెడ్డి సరిపల్లి సహకారంతో ఎంతో విజయవంతంగా ఈ సంస్థ నూ ముందుకు తీసుకెళుతోంది. ఇలా చిన్నారుల పాలిట దేవుడిచ్చిన అమ్మగా మారిపోతుంది శ్రీజ రెడ్డి సరిపల్లి. ఇక ఈ మహిళా మణి చేసిన గొప్ప ఆలోచన ప్రస్తుతం కోటి చిరునవ్వులకు చిరునామా గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: