బుడుగు: పిల్లలు మలబద్దకం సమస్యకు ఇలా చెక్ పెట్టండి..!!

N.ANJI
సమాజంలో తల్లిదండ్రులు పిల్లల గురించి సరిగ్గా పట్టించుకోవడమే మానేశారు. ఇక ప్రస్తుత రోజుల్లో పిల్లల ఆరోగ్య విషయాలను గురించి తల్లిదండ్రులు అనేక రకాలుగా మదన పడుతున్నారు. కాగా.. వారిలో మలబద్దకం సమస్య ఉద్బవించడానికి ఇది కూడా ఒక కారణమే అని ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు ఒకరు వెల్లడించారు. అయితే ఈ లాక్ డౌన్ వలన పిల్లలు అధికంగా స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. అంతేకాక.. పిల్లల్లో మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని సులభమైన ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే సరిపోతుందని, మలబద్దకం సమస్య దూరమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
అయితే మలబద్దకంతో బాధపడే వారికి ప్రతిరోజు ఉదయం పూట వేడి నీళ్లను తాగించాలని చెబుతున్నారు. ఇక ఉదయం పూట 4-5 నానబెట్టిన ఎండు ద్రాక్షలను ఇవ్వాలని అన్నారు. ఇక నిద్ర పోయే ముందు ఒక గ్లాసు వేడి చేసిన ఆవు పాలలో.. టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి ఇవ్వాలని చెబుతున్నారు. ఇలా చేస్తే మలబద్దక సమస్య ఈజీగా సాల్వ్ అవుతుందన్నారు.
అంతేకాక.. గ్యాస్ ప్రాబ్లం నుంచి ఉపశమనం పొందేందుకు మలబద్దకంతో బాధపడే వారి శరీరం మీద హింగ్ ను రాస్తే వారు త్వరగా గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇక పచ్చిగా ఉన్న ఆహార పదార్థాలను కాకుండా మలబద్దకంతో బాధపడే వారి ఉడకబెట్టిన ఆహార పదార్థాలను తినమని చెప్పాలని తెలిపారు. అంతేకాదు.. ఇలా ఉడకబెట్టిన ఆహార పదార్థాలను తినడం వలన అవి సులభంగా జీర్ణమవుతాయని తెలిపారు.
ఇక చక్కెర వాడకాన్ని తగ్గించాలని చెబుతున్నారు. కానీ.. జంక్ ఫుడ్స్, ప్యాకెట్లలో నింపిన స్నాక్స్ తీసుకోవడం తగ్గించాలని చెబుతున్నారు. అయితే.. వీటికి బదులుగా వారికి తాజాగా వండిన భోజనాన్ని అందించాలని చెప్పారు. కాగా.. జంక్ ఫుడ్స్ వాడడం వలన మన పిల్లల్లో మలబద్దకం సమస్య ఏర్పడేందుకు చాలా ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి బయటి ఫుడ్ లను పిల్లలు తినకుండా చూసుకోవాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: