బుడుగు: పిల్లలకు ఎత్తు పళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా..!?

N.ANJI
సాధారణంగా కొంత మంది పిల్లలకు పళ్ళు ఎత్తుగా ఉంటాయి. అయితే వాళ్ళకి ఎత్తులు పళ్ళు రావడానికి కారణాలు ఏంటో చూద్దామా. సాధారణంగా చిన్నపిల్లలు వేలిగోళ్లను కొరికే చెడు అలవాటు ఉంటుంది. దాని వలన దంత సమస్యలతో పాటు దంతాలలో పగుళ్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే గోళ్లు కొరికే అలవాట్లు వల్ల నోటి చిగుళ్ల కణజాలం దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు.. కొన్నిసార్లు దంతాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక వేలిగోళ్ల నుంచి వచ్చే బ్యాక్టీరియా కూడా చిన్నారుల నోటిలో వ్యాపించి తరువాత కడుపు నొప్పికి, ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక పిల్లలు ఏడుస్తున్నపుడు చాలా మంది తల్లిదండ్రులు పడుకునేటప్పుడు వారికి పాల సీసాలని ఇస్తుంటారు. ఆలా చేయడం వలన చిన్నారుల్లో దంతక్షయం, నొప్పికి దారితీస్తుంది. దీనిని నివారించడానికి వారికి పాలసీసాలు ఇచ్చేముందు నోరు తుడిచి కొంచెం నీరు తాగించాలని చెబుతున్నారు. కొంతమంది పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతూ, నములుతూ ఉంటారు. అయితే ఈ అలవాటు అంత మంచిది కాదు.. దాని వలన భవిష్యత్‌లో దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక దంతాల సున్నితత్వం దెబ్బతింటుందని చెబుతున్నారు. కొన్నిసార్లు దంతాలు ఊడిపోతుంటాయి.
అయితే చిన్న పిల్లలకు  బ్రషింగ్ చేసుకునే సమయంలో ఒక్కోసారి బ్రష్‌ను పళ్లకు అదిమిపట్టి చేస్తారు. ఆలా చేయడం మంచిది కాదు.. ఇక ఆలా చేయడం వలన చిన్నారుల పళ్లు చాలా సున్నితంగా, లేతగా ఉంటాయి కాబట్టి వాళ్లు తేలికపాటి చేతులతో బ్రష్ చేసుకునేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఇక ఎక్కువగా బ్రెష్ చేయడం వలన ఎనామెల్ దెబ్బతింటుంది. దీని వలన చిగుళ్ల కణజాలం కుదించడానికి కారణం అవుతుంది. అయితే పిల్లలకు ప్రాథమిక దంతాలు రాగానే సమస్య ఉన్నా లేకున్నా ఒకసారి దంత వైద్యుడిని కలవాలని చెబుతున్నారు. అందుకు తాగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: