బుడుగు: చిన్నారులకు ఈ ఫుడ్ తప్పనిసరిగా పెట్టాలి..!?

N.ANJI
చిన్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక పిసిపిల్లలకు కొంత వయస్సు వచ్చేరకు తల్లిపాలు లేదంటే ఫార్ములా మిల్క్ లేదంటే రెండూ కలిపి ఇవ్వొచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వలన దాదాపుగా అన్ని పోషకాలు తల్లి పాల నుంచి అందుతాయని చెబుతున్నారు. కాగా.. విటమిన్ డి తగినంత దొరకదు. ఇక పిల్లలను ప్రతీ రోజూ సూర్యోదయం సమయంలో కొంత సమయం పాటు ఎండలో ఉంచితే విటమిన్ డి లభిస్తుంది.
అంతేకాదు..  విటమిన్ డి చుక్కల మందు రూపంలో అందించాలని తెలిపారు. ఇక ఐరన్ కూడా వీరికి తగినంత అందదు అని చెప్పారు. అంతేకాక.. వైద్యులు ఐరన్, జింక్, విటమిన్స్ కూడిన డ్రాప్స్ ను సూచించాలని చెబుతున్నారు. అయితే పిల్లలకు పాలిచ్చే తల్లులు పూర్తి పోషకాహారాన్ని తీసుకోవడంపై శ్రద్ద పెట్టాలని సూచించారు.
ఇక వారి నుంచే పిల్లలకు పోషకాలు అందాలి కనుక. తగిన పోషకాహారం తీసుకోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ తగినంత ఉత్పత్తి ఉంటుందని ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. అంతేకాక.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు శిశువులకు ఆరు నెలల వరకు తల్లిపాలు మినహా మరేమీ ఇవ్వకూడదని అన్నారు. అయితే పిల్లలకు రెండో ఏడాది ముగిసే వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ను కొనసాగించాలని తెలిపారు.  ఇక ఆరు నెలల వయసులో శిశువులు ఘన ఆహరాన్ని తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారని తెలిపారు. అంతేకాక.. వారికి రైస్, ఉడికించిన పండ్లు, కూరగాయలు ఇవ్వాలని తెలిపారు.
అయితే ఏడాది వయసుకు వచ్చిన తర్వాత సాధారణంగా ఇంట్లో తినే ఆహార పదార్థాలను ఒక్కొక్కటి యాడ్ చేయాలని సూచించారు. అంతేకాక.. పిల్లలకు ఈ వయసు నుంచే రుచి తెలుస్తోంది. అయితే మంచి ఆహార అలవాట్లకు పునాది పడేది ఇప్పుడే అని అన్నారు. ఇక కొన్నింటి విషయంలో మొహం తిప్పుకుంటుంటే వాటిని పక్కన పెట్టేయకండి అని అన్నారు. అయితే అలా చేస్తే అది జీవితాంతం నిషేధ పదార్థంగా ఉండిపోవచ్చునని అన్నారు. అంతేకాక.. ఒకవేళ ఏదైనా ఆహార పదార్థం సరిపడడం లేదని భావిస్తే పిల్లల వైద్య నిపుణులకు తెలియజేస్తే వారు తగిన సూచనలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: